ఎంపీడీవో మంగతాయారు
జీలుగుమిల్లి:ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి మందులు సరఫరా చేయడమే కాకుండా ప్రాథమిక దశలో ఉన్న వాటిని కూడా గుర్తించి సరైన సికిత్స చేయడానికి అవకాశం ఏర్పడుతుందని జీలుగుమిల్లి మండల అభివృద్ధి అధికారిని మంగతాయారన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి ఆశా వర్కర్ ఆరోగ్య కార్యకర్త గ్రామ వాలంటీర్లు విధిగా జలుడు బట్టి ఎవరికి ఏ విధమైన సమాచారం కావాలన్నా మందులు కావాలన్నా తక్షణమే స్పందిస్తున్నారని దీంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారని అన్నారు. వ్యాధిని గుర్తించడమే కాకుండా నేరుగా మందులు కూడా ఇంటి వద్దకే సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. వ్యాధిగ్రస్తులు ఏ విధమైన అపోహలకు పోకుండా నేరుగా కేంద్రానికి వచ్చి చూయించుకోవాలని ఆమె కోరారు. సరి అయిన సమయంలో సరైన మందులు తీసుకున్నట్లయితే వ్యాధి పూర్తిగా నయమవడం కాకుండా మరలా వచ్చే అవకాశం ఉండదని ఆమె వ్యాధిగ్రస్తులను వారిని ఉద్దేశించి మాట్లాడారు.
•ఆరోగ్య సురక్ష సెకండ్ పేజ్ కార్యక్రమం లో భాగంగా నేడు దర్భగుడెం సచివాలయం పరిధిలో సురక్ష వైద్య శిబిరం ఆమె
ప్రారంభించినారు .ఎంపీడీవో మంగతాయారు, ఎంపిటిసి కంచర్ల సుధారాణి,సర్పంచ్ సున్నం ఉషారాణి స్థానిక ప్రజాప్రతినిధులు మండల సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.