Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలునూతన చట్టాలపై శిక్షణ కార్యక్రమం..!

నూతన చట్టాలపై శిక్షణ కార్యక్రమం..!

ఇప్పటికే 9 జిల్లాలకు చెందిన 80 మంది 2 బ్యాచుల అధికారులకు వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం పూర్తి ఆన్లైన్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహణ మొదటి విడతగా ఫిబ్రవరి 26 నుండి మార్చి 02 వరకు ఆరు రోజులపాటు “జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో వర్చువల్ తరగతుల” ద్వారా బోధించిన కళ్యాణి డాం అధికారులు. ఆరు జిల్లాల నుండి సుమారు 2,900 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తరగతులకు హాజరై శిక్షణ పొందారు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఆదేశాల మేరకు కళ్యాణి డాం పిటిసి ప్రిన్సిపల్ రాధాకృష్ణ.

చంద్రగిరి:

రాష్ట్ర డిజిపి కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ట్రైనింగ్ ఐజి వెంకటరామిరెడ్డి పర్యవేక్షణలో తిరుపతి జిల్లా ఎస్పీ మలిక గర్గ్ సహకారంతో కళ్యాణి డాం పిటిసి ప్రిన్సిపల్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం వారు నూతనంగా తీసుకువచ్చిన మూడు కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినీయం లపై ఇప్పటికే 9 జిల్లాలకు చెందిన 80 మంది రెండు బ్యాచ్ ల పోలీస్ అధికారులకు నేరుగా శిక్షణ ఇవ్వడంజరిగింది.సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియ బాధ్యతలలో పోలీసు అధికారులు, సిబ్బంది తలమునకలు అవుతుండడంతో శిక్షణ కార్యక్రమాన్ని జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ లో నిర్వహించాలని రాష్ట్రడిజిపి కె.వి.రాజేంద్ర నాథ్ రెడ్డి ఆదేశాలుఇచ్చారు.


మొదటి విడతగా ఫిబ్రవరి 26 నుండి మార్చి2 వరకు ఆరు రోజులపాటు ప్రతిరోజు రెండు గంటలసేపు “జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో వర్చువల్ తరగతులు” నిర్వహించి కళ్యాణి డాం పోలీసు అధికారులు బోధించారు. ఈ శిక్షణ తరగతులకు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 2,900 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పోలీస్ స్టేషన్,ల అధికార కార్యాలయాల నుండి హాజరై నూతన భారత శిక్షాస్మృతి చట్టాలు అయినా భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య అధినీయం లపై శిక్షణ పొంది తెలుసుకున్నారు.
ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి హాజరైన పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఎంతో సంతృప్తి వ్యక్తంచేశారని,అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా అభినందించారని, ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముగించడంలో తోడ్పడిన డిఎస్పీలు రామకృష్ణ, శ్రీనివాసులు, మురళి నాయక్, రాజారావు మరియు పిటిసి కళ్యాణి డాం అధ్యాపక అధికారులకు పేరుపేరునా పిటిసి కళ్యాణి డ్యాం ప్రిన్సిపల్ ఎం.కే.రాధాకృష్ణ ధన్యవాదాలుతెలియ
జేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article