Sunday, December 1, 2024

Creating liberating content

సినిమాగోదాదేవిగా శ్రీలీల నాట్య ప్రదర్శన

గోదాదేవిగా శ్రీలీల నాట్య ప్రదర్శన

హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో ఉన్న చిన్నజీయర్ ఆశ్రమంలో సమత కుంభ్-2024 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ యువ నటి శ్రీలీల ప్రదర్శించిన నృత్యరూపకం హైలైట్ గా నిలిచింది. ఆ శ్రీరంగనాథుని కొంగున ముడేసుకున్న తిరుప్పావై ప్రవచనకర్త గోదాదేవిగా శ్రీలీల నాట్య ప్రదర్శన అందరినీ అలరించింది. ఇప్పటి హీరోయిన్లలో శాస్త్రీయ నృత్యంలో ఈ స్థాయి పరిపూర్ణత సాధించినవారు అరుదు అనే చెప్పాలి. శ్రీలీల అంత అద్భుతంగా నాట్యం చేసిందంటే అతిశయోక్తి కాదు. “గోదను నేను గోదను… రంగని తగు దానను” అంటూ తన అందమైన కళ్లతో ఒలికించిన హావభావాలు, ప్రదర్శించిన హస్త ముద్రలు, లయబద్ధమైన పాదాల కదలికలు… చూడ్డానికి రెండు కన్నులు చాలవనిపించేలా శ్రీలీల నాట్యకౌశలాన్ని ఆవిష్కృతం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సినిమాల్లో శ్రీలీలను మోడ్రన్ అమ్మాయిగా చూసిన వారికి ఈ ‘శాస్త్రీయ’ కోణం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై శ్రీలీల స్పందించింది. తాను చిన్నప్పుడే శాస్త్రీయనృత్యంలో శిక్షణ పొందానని వెల్లడించింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ స్టేజ్ పై నాట్యం చేశానని, ఈ ప్రదర్శన తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని చెప్పింది.గోదాదేవి ఒక మహిళా రత్నం అని, అలాంటి స్త్రీమూర్తి గాథ ఎంతో రమ్యంగా ఉంటుందని వివరించింది.ఈ ప్రదర్శన ఇవ్వడానికి మంజుభార్గవి ఎంతో ప్రోత్సహించారని, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article