కామవరపుకోట:ఈ కామవరపుకోట విశాల సహకార సంఘానికి ఏమయ్యింది ఒకప్పుడు రెండు పువ్వులు ఆరు కాయలుగా విరాజిలే సహకార సంఘం నేడు అవినీతిమయంతో కొట్టుమిట్టాడుతుంది. ఒకరి తర్వాత ఒకరు సహకార సంఘాన్ని అప్పులు ఊపులోకి నెటీ వేస్తున్నారు. దీని ఫలితం ఎవరికి ప్రభుత్వానికి తీరని మచ్చ. రైతులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు . ప్రభుత్వాలు మారిన పాలకవర్గాలు మారిన సహకార సంఘంలో చేతివాటముతో కోట్లాది రూపాయలు చేతులు మారి రైతాంగం నిట్ట నిలువునా దోపిడీకి గురవుతున్నారు గతంలో కామవరపుకోట సహకార సంఘంలో లక్షలాది రూపాయలు నిధులు దుర్వినియోగమై నేటి వరకు కేసులు నడుస్తూ ఉండగానే మరో అవినీతి బయటపడింది. గతంలోని పాలకులు పది రూపాయలకు 20 రూపాయలకు కూడా సహకార సంఘం లోని నిధులను దుర్వినియోగం చేసి సంఘాన్ని అపహాస్యం చేశారు. నాడు 51 సెక్షన్ ప్రకారం ఆడిటును వేసి క్షుణ్ణంగా పరిశీలన చేసి లెక్కలు తేల్చారు . నాటి లెక్కలు నేటి వరకు కూడా కోర్టు పరిధిలోని సాగుతుండగానే నేడు కోట్లాది రూపాయలు సహకార సంఘంలోని నిధులు దుర్వినియోగం అయ్యాయి. అంటే సహకార సంఘం లో ఉన్న లోసుకులను అడ్డుపెట్టుకొని రైతులను ముంచేస్తున్నారు. తాత్కాలికి సిబ్బంది కార్యదర్శులు చైర్మన్లతో సహా నిధులు దుర్వినియోగం, గోల్ మాల్ చేస్తున్నారు . సహకార సంఘం లోని నిధులతో కొంతమంది గృహాలు నిర్మించుకోవడం మరి కొంతమంది భూములు కొనుగోలు చేయడం మరి కొంత మంది పెళ్లిళ్లు బారసాలలో చేసుకోవడం వంటివి జరుగుతున్నాయి అంటే సహకార సంఘంలోని విధి విధానాలు ఎంత లోపాకార విధంగా ఉన్నాయో అర్థమవుతుంది. సహకార సంఘాలు ఒకప్పుడు దేశానికి పట్టుకొమ్మల్లాగా రైతాంగానికి వెన్నుముకలుగా నిలిచి చేదోడువాదోడుగా ఉండి రైతన్న ముందుకు నడిపించాయి. నేడు అవే సహకార సంఘాలు వేలవేల బోతూ నిధులు దుర్వినియోగం కోట్లాది రూపాయలు చేతులు మారడంతో సహకార సంఘాలు బిత్తర చూపు చూస్తునే ఉన్నాయి. ఇటీవల కామవరపుకోట సహకార సంఘంలో సుమారు 10 కోట్ల రూపాయలు నిధులు పైగా దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు వెలువడుతున్న తూతూ మంత్రంగా నివేదికలు తయారు చేయించి జిల్లా రిజిస్టార్కు పంపారని తెలుస్తుంది. జిల్లా రిజిస్టర్ నుండి ఆరుగురికి 4.64 కోట్ల రూపాయలకు నోటీసులు అందజేసినట్లు సహకార సంఘం చైర్మన్ చెప్పారు. కామవరపుకోట సహకార సంఘం ఒకప్పుడు జిల్లాలో ఉత్తమ సహకార సంఘం గా అనేక బహుమతులు అందుకుంది. సంఘం పరిధిలో అనేక యంత్రాలు కిట్లు ఎరువులు మోటారు సైకిళ్ళు కార్లు లోన్లుగా ఇచ్చి రైతులను ఆదుకున్న సంఘటనలు ఉన్నాయి. అవి నేడు ఏమయ్యాయి.
నేడు అవేమి లేకపోయాయి నాడు వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలోనే రైతులను చక్కగా ఆదుకున్న పరిస్థితి నేడు సహకార సంఘం పరిధిలో రెండు పెట్రోల్ బంకులు 6 చౌక డిపోలు మూడు ఎరువుల డిపోలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలుగుతున్నప్పటికీ సంఘం పరిధిలోని డబ్బు పక్కదారి మడుతుంది. అధినాయకుడు దారి తప్పడంతో సిబ్బంది అలుసుగా తీసుకొని వారి చేతివాటం ప్రదర్శించి సహకార సంఘాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. మరి కొంతమంది రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కేసుల నుండి బయట పడే విధంగా తయారయ్యారు . ఏది ఏమైనా సహకార సంఘాలలోని లోసుగులు వల్ల రైతు సంఘానికి ఏమాత్రం మేలు జరగకపోగా సిబ్బందికి మాత్రం కామదేనుముల ఉంది. ప్రభుత్వాలు సహకార సంఘాలను నిర్వీర్యం చేసే విధంగా త్రిసభ్య కమిటీ వేయడం వల్లనే ఈ విధమైన దోపిడీకి సహకార సంఘాలు ఆవాలు మారాయని ఆరోపిస్తున్నారు. ఇటీవలే టీ నర్సాపురం, రంగాపురం వివిధ సహకార సంఘాలు అవినీతిలో మునిగిపోయాయి పూర్తిస్థాయి సంఘాలనోప్పటికీ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. సహకార సంఘంలో సొసైటీ కార్యదర్శి టి బాబురావును వివరణ అడగగా తనకు ఏ విధమైన సమాచారం లేదని మొఖం ఏదైనా ఉంటే స్థానిక చైర్ పర్సన్ సాయినా కనకరాజును మాత్రమే అడగండి అంటూ అక్కడి నుండి తప్పుకున్నాడు. తను కూడా నోటీసులు అందుకున్న వారిలో ఉండడంతో మాకు సాటిస్తున్నట్లుగా అర్థమైంది . నోటీసులు అందుకున్న వారిలో సహకార సంఘం ప్రస్తుత కార్యదర్శి టి బాబురావు, సూపర్వైజర్ గంట మధు , బంక్ సూపర్వైజర్ చాటపర్తి శేఖరు , క్యాషీర్ తోట చర్ల వాసు , మరో క్యాషియర్ పెద్దింటి నాగదుర్గ ఎలియాస్ లక్ష్మి, మరో క్యాషియర్ తమ్మిశెట్టి సత్యనారాయణ కు 4.4 కోట్ల రూపాయలకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ నూజివీడు జిల్లా రిజిస్టర్ నుండి నోటీసులు అందినట్లు సహాయనిక రాజు చెప్పారు. ఇందులో నాటకీయ పరిమాణం ఏంటంటే ప్రస్తుత చైర్మన్ పేర్లు చెప్పడానికి కూడా వెనకాడుతున్నాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు నాటి పరిస్థితికి నేడు భిన్నంగా మారాయి. సహకార సంఘంలో నిధులు గోలుమాలినటువంటి వారిపైన తక్షణ చర్యలు తీసుకొని వారి నుండి నిధులు రాబట్టాలని వారి ఆస్తులను జప్తు చేయాలంటూ పలు సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో సహకార సంఘం వద్ద ధర్నాలు రాస్తారోకోలు చేపట్టేటందుకుగాను వివిధ సంఘాలు సమాయత్తమవుతున్నాయి.