తల్లిదండ్రుల ఆశయాలు, కోరికలు లక్ష్యాలే విద్యార్థులకు సాధన లక్ష్యం పేదరికంతో పుట్టడం తప్పు కాదు పేదరికంతో చనిపోవడమే తప్పు జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి
బద్వేల్:ఆదివారం నాడు వైఎస్ఆర్ జిల్లాలోని బి కోడూరు మండలం కాసానగరంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారి డా.అంబవరం ప్రభాకర్ రెడ్డి సందర్శించి అక్కడ జరుగుతున్న మనబడి నారు నేడు పనులను అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న వసతులను భోజన సదుపాయాన్ని పరిశీలించడం జరిగింది అనంతరం విద్యార్థులతో సమావేశమై స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో విద్యార్థులకు చదువు, సంస్కారము మరియు భవిష్యత్తులో ఉన్నత స్థానం చేరుకోవడానికి ఉండవలసిన లక్షణాలను తెలియజేశారు .
ఈ సందర్భంగా డాక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ సమాజంలో పేదరికం పోవాలన్నా తల్లిదండ్రులకు విద్యార్థులకు గౌరవం ,గుర్తింపు దక్కలాన్న సమాజపు పురోగతి చెందాలన్నా విద్యార్థులకు చదువు ఒకటే మార్గమని విద్యార్థుల చదువే తల్లిదండ్రులు ఆస్తి అని ఆయన గుర్తు చేశారు .అదేవిధంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కోరికలు, ఆశయాలను మరియు వారి లక్ష్యాలను మన లక్ష్యాలుగా పెట్టుకోవాలని ఆ లక్ష్యం నెరవేరేందుకు నిరంతర శ్రమ ,కృషి, పట్టుదల తప్పనిసరిగా ఉండాలని విద్యార్థులకు తెలిపారు.. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్టు పేదరికంలో పుట్టడం తప్పు కాదు కానీ పేదరికంతోనే చనిపోవడం తప్పు అని ప్రతి విద్యార్థి స్వయంకృషితో ఒక లక్ష్యం నిర్దేశించుకుని ఈ సమాజంలో గొప్ప వ్యక్తిగా రాణించడానికి కృషి, పట్టుదల తపన తప్పనిసరిగా ఉండాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి రాణించాలని తపన, కోరిక ఉంటే సాధిం.