ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన వైకాపా సర్కార్ ▪️డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిందే చంద్రబాబు ▪️నియోజవర్గానికి ఏం చేశారో మంత్రి తెలిపి ఉంటే బాగుండేది ▪️నల్లచెరువు బహిరంగ సభలో మంత్రి మాట్లాడిన మాటలకు పొంతన లేదు ▪️అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచింది టిడిపి నే ▪️చంద్రబాబును విమర్శించే స్థాయి మంత్రి పెద్దిరెడ్డికి లేదు ▪️మంత్రి పెద్దిరెడ్డి పై ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నర్సరీ లక్ష్మీపతి నాయుడు
నల్లచెరువు:గత సార్వత్రిక ఎన్నికల సమయంలో దిక్కులేని హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత హామీలను తుంగలో తొక్కాడని ప్రజలు మోసం చేయడంలో జగన్ దిట్ట అని నల్లచెరువు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నర్సరీ లక్ష్మీపతి నాయుడు ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన ఆసరా కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుపై చేసిన విమర్శలను ఆయన తిప్పి కొట్టారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిదని హితువు పలికారు. మహిళా సంక్షేమానికి వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడిన చంద్రబాబును ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని తెలిపారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల ను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను ఎందుకు నిర్వర్తించలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రి పెద్దిరెడ్డి పై ఉందని డిమాండ్ చేశారు. కదిరి నియోజవర్గానికి ఏం చేశారో బహిరంగ సభలో మంత్రి తెలిపి ఉంటే బాగుండేదన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో కందికుంట వెంకటప్రసాద్ కృషితో చెర్లోపల్లి జలాశయానికి కృష్ణా జలాలు తీసుకువచ్చి ఈ ప్రాంతంలోని చెరువులకు నీరు అందించిన ఘనత తమకే దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ నేనని ఇన్పుట్ సబ్సిడీ, రుణ మాఫీ, ఇన్సూరెన్స్, అన్నదాత, డ్రిప్ ఇరిగేషన్ తదితర పథకాలు అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. వైకాపా ప్రభుత్వం మాత్రం రైతులకు చేసింది శూన్యమన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస బాటపడుతున్న దుస్థితి నెలకుందన్నారు. మద్యపాన నిషేధం చేసే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు హామీని విస్మరించారో ఆసరా కార్యక్రమంలో మహిళలకు సమాధానం తెలిపి ఉంటే బాగుండేదని హితువు పలికారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైకాపా ప్రభుత్వం పై విసిగిపోయారని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.