తనకల్లు:వైసీపీ ప్రజల ప్రభుత్వం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తనకల్లు మండ్లిపల్లి మిట్ట వద్ద వైఎస్ఆర్ అసరా పతకానికి సంబంధందించిన చెక్కునును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అందజేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని, నవరత్నాలు పేరుతో మన ప్రియతమ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహనరెడ్డి ప్రజలకోసం ప్రవేశపెట్టడని తెలిపారు. విద్య, వైద్య,తదితర పథకాలను వినూత్న రీతిలో మన ప్రభుత్వం దూసుకుపోతోందన్నారు. అన్ని రంగాల్లో ప్రజలకు న్యాయం చేసింది మనప్రభుత్వం అన్నారు. కదిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మాక్బుల్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు. అనంతరం మహిళలకు వైస్ఆర్ ఆసరా చెక్కును అందజేశారు.కార్యక్రమలో మండలంలోని వైసీపీ నాయకులు