ఇస్లామాబాద్: షెహబాజ్ షరీఫ్ రెండోసారి పాకిస్థాన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. సోమవారం రాష్ట్రపతి భవనంలో ఆయన 33వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 336 సభ్యుల ఉన్న జాతీయ అసెంబ్లీలో ఆదివారం ప్రధానమంత్రి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. అందులో పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన షెహబాజ్201 ఓట్లు సాధించారు. షరీఫ్మొదటిసారి 2022 ఏప్రిల్‌నుంచి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించారు. ఈ నేపథ్యంలో తనను ప్రధానిగా చేసినందుకు అందరికి షెహబాజ్కృతజ్ఞలు తెలిపారు. ‘ నాపై విశ్వాసం ఉంచి నున్ను ప్రధానిగా ఎన్నుకున్నందుకు అందరికీ నా ధన్యవాదములు. పాకిస్థాన్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రతిభావంతులైన వ్యక్తులు ఈ పార్లమెంటులో ఉన్నారు. వీరిలో జర్నలిస్టుల, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఇప్పుడు మన ముందు పెద్ద సవాలే ఉంది. ఈ పని కష్టమే కానీ, పాకిస్థాన్ విధిని మార్చాలి అని అందరం కలిసి అనుకుంటే అది సాధ్యం అవుతుంది’ అని షెహబాజ్ వ్యాఖ్యానించారు.