ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ కేపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న లానింగ్ గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. మహిళా టీ20 క్రికెట్‌లో సోఫీ 297 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా లానింగ్ 289 ఇన్నింగ్స్‌లలో ఆ రికార్డును అందుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బెత్ మూనీ (299), సునీ బేట్స్ (323) ఉన్నారు.
మ్యాచ్‌కు ముందు ఈ ఘనత సాధించడానికి అడుగు దూరంలో ఉన్న లానింగ్ ఈ సీజన్‌లో రెండో అర్ధ శతకం సాధించడం ద్వారా ఈ అరుదైన రికార్డు అందుకుంది. ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్సర్‌తో 55 పరుగులు చేసిన ఆమె జట్టు 163 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ ఫాస్టెస్ట్ 9000 పరుగుల రికార్డును అధిగమించింది.