రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. అయితే, మాజీ మంత్రి, వైకాపా నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మాత్రం సచివాలయాన్ని తాకట్టు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదంటున్నారు.ఈ నేపథ్యంలో కొడాలి నాని స్పందిస్తూ చంద్రబాబుపై మండిపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెడ్డడం సాధారణ విషయమేనని చెప్పారు. సచివాలయం అనేది కేవలం పదెకరాల ఆస్తి మాత్రమేనని అన్నారు. ఈ ఆస్తులు మాత్రమే తాకట్టు పెట్టాలనే విషయం రాజ్యాంగంలో ప్రత్యేకంగా రాశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఒక చిల్లర నాయకుడదని… ఆయన చేసేదే సంసారం అని చెప్పుకుంటాడని విమర్శించారు. రాష్ట్ర అప్పులు రూ. 4 లక్షల కోట్లు ఉంటే… అందులో చంద్రబాబు చేసినవి రూ. 2.50 లక్షల కోట్లు అని అన్నారు.