Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుపరిచయం లేని స్త్రీను డార్లింగ్ అని పిలిస్తే అది లైంగిక వేధింపు : కోల్‌కతా హైకోర్టు

పరిచయం లేని స్త్రీను డార్లింగ్ అని పిలిస్తే అది లైంగిక వేధింపు : కోల్‌కతా హైకోర్టు

మనకు ఇష్టమైనవారిని డార్లింగ్ అన పిలవడం సాధారణమైన విషయం. అందులో తప్పేమీ ఉండదు. కానీ, పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే మాత్రం కష్టాలు తప్పవని కోల్‌కత్తా హైకోర్టు తీర్పు ఇచ్చింది..
అసలేం జరిగిందంటే.. కోల్‌కతాలో దుర్గాపూజ సందర్భంగా బందోబస్తు కోసం మహిళా పోలీసులను కూడా నియమించారు. అయితే, ఓ వ్యక్తి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్‌ అని పిలిచాడు. దాంతో ఆ మహిళా పోలీసు సదరు వ్యక్తిపై మాయాబందర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అతడిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా కోల్‌కతా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏ మాత్రం పరిచయం లేకుండానే ఓ మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందికి వస్తుందని స్పష్టం చేసింది. అలా పిలిచిన వారిని ఐపీసీ 354ఏ, 509 సెక్షన్ల కింద విచారించవచ్చునని హైకోర్టు పేర్కొంది. పరిచయం లేని మహిళ పట్ల డార్లింగ్ అనే పదాన్ని ఉపయోగించడం అసభ్యత కిందికి వస్తుందని కోల్‌కతా హైకోర్టు ధర్మాసనం వివరించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article