ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట మోత మోగుతూనే ఉంది. ఏ ఈవెంట్ అయినా ఈ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ హవా కనిపిస్తూనే ఉంది. మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హాజరైతే ఇక ఆ ఈవెంట్లో ఈ సాంగ్ మస్ట్ అనేలా మారిపోయింది. మార్చి 6 బుధవారం ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీ10 క్రికెట్ టోర్నీ ప్రారంభ వేడుకలోనూ నాటు నాటు సాంగ్ ప్రత్యేకంగా నిలిచింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, రామ్చరణ్ ఈ పాటకు కలిసి స్టెప్ వేశారు.
ఐఎస్పీఎల్ టోర్నీ ప్రారంభ వేడుక ముంబై నగరం థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలో నేడు జరిగింది. ఈ టోర్నీలో రామ్చరణ్ సహా కొందరు సినీ స్టార్లకు జట్లు ఉన్నాయి. ఈ ప్రారంభ ఈవెంట్కు సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు.ఈ ఈవెంట్లో నాటు నాటు పాటకు సచిన్ టెండూల్కర్, రామ్చరణ్, తమిళ స్టార్ సూర్య, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కలిసి స్టెప్స్ వేశారు. ఒకరి చేయి ఒకరు పట్టుకొని డ్యాన్స్ చేశారు. సినీ హీరోలతో సచిన్ కూడా జోష్గా కాలు కదిపారు. ఉత్సాహంగా డ్యాన్స్ ఆడారు. ఈ స్టార్లు డ్యాన్స్ చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది. నాటు నాటు పాటకు సచిన్, రామ్చరణ్, సూర్య, అక్షయ్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐఎస్పీఎల్ టోర్నీ మార్చి 6 నుంచి మార్చి 15వ తేదీ వరకు జరగనుంది. ముంబైలో థానేలోని దాదోజీ కొండదేవ్ స్టేడియంలోనే మ్యాచ్లు అన్నీ జరగనున్నాయి. నేడు మజ్హి ముంబై, శ్రీనగర్ కే వీర్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.ఈ ఈవెంట్లో రామ్చరణ్, సూర్య ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కౌగిలించుకున్నవీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.