ప్రొద్దుటూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన భార్య మౌనిక రెడ్డి, అక్క హరిత రెడ్డిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళ నాయకురాలు దాదాపు 55 మంది గర్భిణీ మహిళలకు సీమంత మహోత్సవం నిర్వహించారు. గురువారం స్థానిక పద్మశాలీయ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మౌనిక రెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ సీమంత మహోత్సవాన్ని జరుపుతున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇలాగే మహిళలకు శ్రీమంతాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలను గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. మహాశక్తి, తల్లికి వందనం లాంటి పథకాల ద్వారా రానున్న కాలంలో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. మహిళా దినోత్సవాన్ని పరిష్కరించుకొని మహిళలకు శ్రీమంతాలు చేయడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను ఆదుకున్న పార్టీ, పసుపు- కుంకుమల ద్వారా వారి జీవితానికి ఆర్థిక భరోసానిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నే అన్నారు. హరిత రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలకు రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతినెల 1500 రూపాయలు ఇవ్వడంతో పాటు బడికి వెళ్లే పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి సంవత్సరానికి 15000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందింది తెలుగుదేశం పార్టీ పాలనలోనే అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు కోటా శ్రీదేవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, టిడిపి మహిళా నాయకురాల్లో సూలం లక్ష్మీదేవి, పిట్ట చౌడమ్మ, వల్ల లక్ష్మీదేవి, లక్ష్మీ లిఖిత, అమ్మని తదితరులు పాల్గొన్నారు.