Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఇందిరమ్మ ఇళ్లకు దళిత, గిరిజనులకు రూ.6 లక్షలు

ఇందిరమ్మ ఇళ్లకు దళిత, గిరిజనులకు రూ.6 లక్షలు

గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తున్నాం: భట్టి విక్రమార్క

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సోమవారం భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…ఇందిరమ్మ ఇళ్ల పథకంలో గిరిజనులు, దళితులకు మరో రూ.లక్ష అదనంగా కలిపి మొత్తంగా రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించారు. సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఇళ్ల కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున అర్హులైన అందరికీ ఇళ్లు రాబోతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లుగా పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోనేందుకు ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా పథకాలు అమలుచేస్తున్నామన్నారు. ఎవరి మెప్పు కోసమో పథకాలు అమలు చేయడంలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాని, బీఆర్ఎస్ కు తేడా గమనించాలన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రతీ పైసా పేదల కోసమే ఖర్చు చేస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే నిధులు ఇచ్చిందన్నారు. గోదావరిపై బ్రిడ్జి, మంచినీటి సదుపాయం, భద్రాచలం అభివృద్ధికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు.భద్రాచలం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భద్రాద్రి రాముడిని సైతం కేసీఆర్ మోసం చేశారన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల ఉబిలో నెట్టారని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేరుతో పేదలను మోసం చేశారన్నారు.రాష్ట్ర ప్రజల బాధలు చూసే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించిందన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు కూడా త్వరలోనే పట్టాలిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. సొంతింటి కల సాకారం కోసం పదేళ్లుగా తెలంగాణ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article