-సిపిఐ డిమాండ్
పేదలపై బద్వేల్ ఆర్డీవో తీరు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యాలయం ముట్టడి
బద్వేల్ :గోపవరం మండలం పి పి కుంట వద్ద గుడిసెలు వేసుకున్న పేదలను భయభ్రాంతులకు గురి చేస్తున్న బద్వేల్ ఆర్డీవో తీరు నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో సోమవారం బద్వేల్ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు భూ పోరాట కమిటీ కన్వీనర్ పివి రమణ అధ్యక్షత వహించగ ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ….. గోపవరం బద్వేలు మండలాలలో నిరుపేదలు ఇంటి జాగా కోసం అనేకసార్లు అధికారుల చుట్టూ తిరిగి వేసారి ఆరు నెలల క్రితం వారి దరఖాస్తులన్నీ ప్రస్తుత ఆర్డిఓ గారికి అందజేసినప్పటికీ స్పందించకపోవడంతో ఫిబ్రవరి 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) ఆధ్వర్యంలో పేదలందరూ సర్వే నెంబరు 15 67 నందు పూరి గుడిసెలు వేసుకొని కరెంటు మంచినీళ్లు లేకపోయినా అక్కడే రాత్రింబవళ్లు నివాసం ఉంటున్నారని అలాంటి పేదలను కనుకరించాల్సిన బద్వేల్ ఆర్డీవో మీ గుడిసెలను తొలగించడంపేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయంగా సరికాద నీ ప్రభుత్వ భూములు, కొండలు వంకలు వాగులు సైతం ఆక్రమించుకుంటే వారి దగ్గర ముడుపులు తీసుకున్న రెవిన్యూ అధికారుల అక్రమాలు పాల్పడుతున్నారని అన్నా ఉద్యమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయము రాష్ట్ర కేంద్రానికి తీసుకెళ్తాభూ పోరాటం జోలికి రావద్దని ఆయన హితవు పలికారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ జిల్లా సమితి సభ్యులు ప డిగే వెంకటరమణ, భూ పోరాటకు కన్వీనర్ బాలు, దళిత హక్కుల పోరాట సమితి (DHPS) జిల్లా అధ్యక్షులు ఇమ్మానియేల్ సిపిఐ గోపవరం మండల కార్యదర్శి పెంచలయ్య, పాల్గొన్నారు.