ఏలేశ్వరం:-ప్రత్తిపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఉమ్మిడి వెంకటరావు కాంగ్రెస్ పార్టీకి తన పదవికి రాజీనామా చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు వైఎస్ షర్మిలకు తన రాజీనామా లేఖను పంపించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వ్యక్తిగత కారణాలు దృష్ట్యా ప్రతిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పదవికి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ కిసాన్ సెల్ కోఆపరేటివ్ నెంబర్ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. గత 17 సంవత్సరాలుగా పార్టీకి ఎనలేని సేవలు అందించాలని అలాగే పార్టీ కూడా తనకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందన్నారు.