ఏలేశ్వరం:- పట్టణం లో సోమవారం భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద బీజేపీ కాకినాడ జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉచిత ఉజ్జ్వల గ్యాస్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొల్లా మాట్లాడుతూ మండల పరిధిలోని తూర్పు లక్ష్మీ పురం గ్రామానికి చెందిన 15 మంది మహిళలకు ఉచిత ఉజ్జ్వల గ్యాస్ లు మంజూరు అయినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ గ్యాస్ లను బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ గారి చేతులు మీదుగా బుధవారం లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందని మండల ఉపాధ్యక్షులు పతివాడ వెంకటేశ్వర రావు తెలిపారు.వికసిత భారత్ సంకల్ప దీక్ష తో పని చేస్తున్న ప్రధాని మోడీ కి ప్రజలందరూ మద్దత్తు తెలపాలని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమం లో భారత్ గ్యాస్ ఏజెన్సీ అధినేత శ్రీనివాస్,సిబ్బంది పాల్గొన్నారు.