వేంపల్లె :స్థానిక పట్టణంలోని వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో కుమ్మరాంపల్లి లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడమైనదని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు జరిగే వివిధ అంశాలమీద స్థానికులకు అవగాహన కల్పిస్తూ వారి స్థితిగతులను మదింపు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఓబుల్ రెడ్డి మాట్లాడుతు పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. ఎంపీపీ స్కూల్ హెడ్ టీచర్ రెడ్డి మాలతి మాట్లాడుతూ ఇటువంటి ప్రత్యేక శిబిరం పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేయడం సంతోష దాయకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 ఆఫీసర్ మల్లేశ్వరమ్మ, ఫిజికల్ డైరెక్టర్ తేజంద్ర మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.