కదిరి :వైసీపీ అరాచక పాలన మాకొద్దంటూ వందలాది మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని మాజీ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆయన నివాసంలో ఎన్.పీ కుంట మండలం ధనియానిచెరువు పంచాయతీ, గోవిందరాజు పల్లికి చెందిన సుమారు 20 కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారిలో రెడ్డప్ప రెడ్డి, చిన్న రెడ్డప్ప రెడ్డి, రాము, నడిపి రెడ్డప్ప రెడ్డి, సుధాకర్ రెడ్డి, శివ రెడ్డి, శీన, శివయ్య, సూరి, రమనప్ప నాయుడు, రాజా రెడ్డి, కె.రెడ్డప్ప రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, శ్రీహరి నాయుడు తదితరులు ఉన్నారు. కందికుంట వారికి పార్టీ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కందికుంట మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని, అందుకే వైసీపీ నాయకులు టీడీపీలోకి వలసలు వస్తున్నారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపారు. కదిరి ఉమ్మడి అభ్యర్థి, తన సతీమణి కందికుంట యశోద దేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని, అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వాల్మీకి స్కూల్ అధినేత పి.వి. పవన్ కుమార్ రెడ్డి, కె.పి.అంజినప్ప నాయుడు, అక్కులప్ప, కుమార్ నాయుడు, కొండయ్య, హనుమంతు రెడ్డి, రాం మోహన్ నాయుడు, రెడ్డప్ప, హరి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.