ధరణి జయహో..విద్యారోహిణి హైస్కూల్లో3333విద్యార్థులతో కార్యక్రమం.
బుట్టాయిగూడెం: జయహో ధరణి జయహో… పేరిట మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు చేపట్టిన పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైనట్లు విద్యా రోహిణి హైస్కూల్ కరస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ తెలిపారు.స్థానిక విద్యారోహిణి హైస్కూల్ నందు సోమవారం జయహో ధరణి జయహో పేరిట లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం చిన్నారులలో పాఠశాల స్థాయి నుంచి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించి తద్వారా జీవావరణ సమతుల్యాన్ని సాధించడమేనని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధాన సమస్య వాయు కాలుష్యం అని, విచక్షణారహితంగా అడవులను, పరిసరాలలో చెట్లను నరికి వేయడం వల్ల భూమి మీద నివసిస్తున్న అన్ని రకాల జీవరాసుల మనుగడను ప్రమాదం లోకి నెట్టేస్తుందని అన్నారు. ఎప్పుడైతే వాతావరణ కాలుష్యం పెరిగిందో వ్యాధులు పెరుగి, తద్వారా మానవ మనుగడకి సమస్య ఏర్పడుతుందనీ తెలిపారు. చిన్నారుల ద్వారా సమాజానికి, ప్రభుత్వానికి, ఈ ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ఉద్దేశంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ఆధ్వర్యంలో జానపద కళాకారుడు కృష్ణబాబు సారధ్యంలో 3333 మంది విద్యార్థిని విద్యార్థులతో జయహోదరి జయహో పేరిట పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతాల పాఠశాలలకు వెళ్లి ఈ 3333 మంది విద్యార్థులను ఈ కార్యక్రమానికి సమాయత్తం చేసి దిగ్విజయంగా ఈ ప్రపంచ రికార్డుకి అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జెట్టి నాగేంద్ర బాబు, విద్యా రోహిణి డిజిటల్ స్కూల్ సిబ్బంది, జానపద కళాకారుడు ఎల్.ఆర్.కృష్ణ బాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.