మనిషిని మనిషే కరిచే వేళ
ద్వేషం విషమై కురిసే వేళ..
నిప్పులు మింగి
నిజమును తెలిపి..
చల్లని మమతల
సుధలను చిలికి..
అమరజీవులై
వెలిగిన మూర్తుల..
సేవాగుణం మాకందింపరావా..
అలాంటి సేవాగుణమే
జీన్ హెన్రీ డ్యూనంట్లో
పొడసూపి..
రెడ్ క్రాస్ సంస్థ ఆవిర్భావమై..
అదే ప్రపంచ సేవాపీఠమై..!
ఔను మరి..
ఎక్కడ హెన్రీ జననం..
వ్యాపారి..ఆపై దేశసంచారి..
అలా వెళ్ళి లావర్డి..
అక్కడ యుద్ధంలో క్షతగాత్రులను గాంచి..
మనసు చలించి..
వృత్తిని..ప్రవృత్తిని మరచి..
సేవయే మార్గమని ఎంచి..
తపిస్తే..తపస్సు చేస్తే..
ఆవిర్భవించింది రెడ్ క్రాస్..
ప్రపంచమే వేదికై..
సేవించడమే వేడుకై..
అదే వాడుకై..!
మానవత..నిష్పాక్షికత..
సమతౌల్యత.. స్వతంత్రం..
స్వచ్ఛందసేవ..ఐక్యత..
విశ్వజనీయత..
సప్తసూత్రాల మహాసంస్థ..
జగమెల్ల విస్తరించి..
జనులెల్ల చేయి కలపగా..
యుద్ధాలలో ఎవరు ఎటైనా
క్షతగాత్రులకు సాయం..
మామూలు వేళల్లో
నిరంతర సేవ..
అదే..అదే..
హెన్రీ చూపిన త్రోవ..
మొత్తంగా రెడ్ క్రాస్
ప్రపంచ సంస్థల్లో ప్రత్యేక కోవ!
సురేష్ కుమార్
9948546286