Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుప్రజానీవాసాల మధ్య మున్సిపాలిటీ అధికారుల ఘనకార్యం

ప్రజానీవాసాల మధ్య మున్సిపాలిటీ అధికారుల ఘనకార్యం

కడప సిటీ: ప్రజలు నివాసం ఉండే చోట చెత్త డంప్ యార్డ్ చెయ్యటం చాన దారుణం అని టీడీపీ నాయకులు అఫ్సర్ ఖాన్అన్నారు. నేడు కడప నగరంలోనీ 34 వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ఆయన కొన్ని స్థానిక సమస్యలను ప్రజలు తన దృష్టికితీసుకువచ్చారని ,అందులో ఒక ముఖ్య మైన సమస్య తమ ఇంటిముందు ఉన్న ఖాళీ స్థలంలో స్థానిక కార్పొరేషన్ వారు,కార్పొరేటర్ కలిసి ఇక్కడ డివిజన్ లోని చెత్తను మొత్తని తెచ్చి తమ ఇంటిముందర వేస్తున్నారు అని వారువాపోయారు.అదేవిధంగా ఈ చెత్త వల్ల అనేకరకాల అంటువ్యాధులు దగ్గరగా ఉన్న తమకు సోకుతున్నయని వీటి వల్ల ఒక మహిళ తన బిడ్డకు ఇన్ఫెక్షన్సోకిమరణించింది,అన్న విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారు అని ఆయన తెలిపారు. నగర కార్పొరేషన్ వారు పన్నుల మీద శ్రద్ద ప్రజల ప్రాణాల మీద లేదు అని ఆయన విమర్శించారు. కాబట్టి ఇకనైనా అక్కడి చెత్త డంప్ ను అక్కడి నుంచి తొలగించి ప్రజల సమస్యను తీర్చాలని ఆయన కార్పొరేషన్ యంత్రాంగాన్ని కోరారు.నీటి వనరుల మీద కనీసం అవగాహన లేని పాలకుల మాట విని బిత్తరపోతున్న కడప ప్రజలు
వేసవి రాకముందే కడప నగరం నీటి సంక్షోభం ముంగిట నిలిచింది. నీటి కొరత వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అందరూ చూస్తున్నదే. మంచి నీటి కోసం ఎదురుచూసి, చూసి ప్రజలు తమ ఇండ్లకు తాళాలు వేసి బంధువుల ఇండ్లకు పోయే గడ్డు పరిస్థితినేడు కడపలో
ఏర్పడింది అన్నారు.
ఎండలు దంచికొడుతున్న తరుణంలో నీటి కొరతను అధిగమించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన ప్రశ్నించారు? ఏ ప్రత్యామ్నాయాలతో నీటి సంక్షోభాన్ని అరికడతారో పాలకులు, అధికారులు ప్రజలకు తెలియపర్చాలిచి ఉంది.కార్పోరేషన్ ట్యాంకర్ల ద్వారా ఒక ఇంటికి వచ్చే 2, 3 బిందెల నీళ్ళు వారి ఏ అవసరాలకు కూడా సరిపోవడం లేదు. 50 డివిజన్లలకు నీళ్ళు సప్లై చేయుటకు సరిపడా ట్యాంకర్లు కార్పొరేషన్ వద్ద లేవు. ముందు నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టండి.. సోషియల్ మీడియాలో కౌంటర్లు ఇవ్వడం కాదు, ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాముఅని అప్సర్ ఖాన్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article