తనకల్లు :రోజు రోజుకు టీడీపీకి ప్రజా ధరణ పెరుగుతోంది దింతో
తనకళ్ళు మండలం ఎంసి తాండ,దేవలం తాండ,భీంలా నాయక్ తాండ,బాబేనాయక్ తాండ,ఏనుగుండు తాండ, నడిమి తాండ,గుట్టమీద తాండ, రామ్మప్ప కుంట తాండ ల నుంచి సుమారు 100 కుటుంబాలు వైసిపి పార్టీ ని వీడి కదిరి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్యెల్యే అభ్యర్థి గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో బుధవారం చేరడం జరిగింది పార్టీ లో చేరిన వారిని కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్బంగా కంది కుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ అన్యాయం అర్జెంట్ గా ప్రజలకు తెలుస్తుంది, నిజాయితీ నిదానంగా తెలుస్తుంది అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈఐదేళ్ల వైసీపీ తో ప్రజలు అనేక ఇబ్బదులు పడ్డారాని కందికుంట తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ఆగడాలను ప్రజలు తట్టుకోలేక టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని,గ్రామాలుగ్రామలే ప్రజలు పార్టీలోకి చేరుతున్నారు మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాష్ట్రనీకి మేలు జరుగుతుందని ప్రజలు గమనిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలన ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో తనకళ్ళు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.