టి.నరసాపురం. :ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి చెర్రీ బాలరాజు బుధవారం మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత అంతా కూడా కూటమీవైపే ఉన్నారని ఉద్యోగులు ఉపాధ్యాయులు రైతులు మహిళలు అందరూ కూటమి అభ్యర్థులను ఘనంగా గెలిపిస్తారన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు నియోజక వర్గానికి ఏమీ చేయలేదన్నారు. బాలరాజు ఓడిపోతానని వచ్చిన సమాచారం మేరకు తన భార్యను ఎన్నికల్లో నిలబెడుతున్నాడు అన్నారు. ఎవరు నిలబడ్డా తన గెలుపు ఖాయమన్నారు. గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.50 ఏళ్లు దాటిన వారికి పింఛను 4000 ఇవ్వటం, మహిళలకు మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇవ్వటం, నిరుద్యోగులకు పది లక్షల రుణాలు తదితర సూపర్ సిక్స్ పథకాలు కూటమిని గెలిపిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అడపా నాగరాజు మధ్యాహ్నపు పెంటారావు తదితరులు వందలాది మంది పాల్గొన్నారు.