ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి పుచ్చకాయలను బాగా తింటుంటారు. ఈ పండును తింటే బాడీ హీట్ తగ్గడంతో పాటుగా ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. అయితే చాలా మంది పుచ్చకాయ గుజ్జును తిని గింజలను పారేస్తుంటారు. కానీ పుచ్చకాయ గింజలను తిన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారు తెలుసా? ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకే బయటకు వెళ్లకుండా ఎండలు మండుతున్నాయి.ఈ వేడిని తట్టుకోవాలంటే వాటర్ ను పుష్కలంగా తాగాలి. అలాగే వాటర్ కంటెంట్ ఉండే పండ్లను కూడా తినాలి. ఈ సీజన్ లో పుచ్చకాయలు మనకు అందుబాటులో ఉంటాయి. నిజానికి పుచ్చకాయలను తింటే మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే చల్లగా కూడా ఉంటాయి. మనం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. ఈ సీజన్ లో మన శరీరం కూల్ గా ఉండాలంటే మాత్రం మన ఆహారపు అలవాట్లను చాలా వరకు మార్చుకోవాలి. అంటే పండ్లు, కూరగాయలను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయను ఖచ్చితంగా తినాలి. అయితే చాలా మంది పుచ్చకాయ గుజ్జును తినేసి వాటి గింజలను విసిరేస్తారు. కానీ పుచ్చకాయ మాత్రమే కాదు, దాని విత్తనాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ విత్తనాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఈ విత్తనాల్లో మెండుగా ఉంటాయి. అంతేకాక వీటిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. అసలు మనం పుచ్చకాయ గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.డయాబెటీస్ పేషెంట్లు కొన్ని పండ్లను తినకూడదు. ఎందుకంటే కొన్ని పండ్లలో షుగర్ కంటెంట్ ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినొచ్చు. పుచ్చకాయ గింజలను కూడా తినొచ్చు. అయితే పుచ్చకాయ గింజలు డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు మధుమేహాన్ని కంట్రోల్ చేస్తాయి. వయసు మీద పడుతున్నా ఈ గింజలను తింటే మీరు యవ్వనంగా కనిపిస్తారు. అవును ఈ గింజలు చర్మాన్ని చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి. ముడతలను తగ్గిస్తాయి. పుచ్చకాయ విత్తనాల్లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడతాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు.అయితే పుచ్చకాయ విత్తనాలు ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడతాయి. ఈ విత్తనాల్లో లైకోపీన్ ఉంటుంది. ఇది ఒక శక్తివంతమై యాంటీఆక్సిడెంట్. ఇది పురుషుల సంతానోత్పత్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.
మెమోరీ పవర్ ను పెంచడానికి పుచ్చకాయ విత్తనాలు బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. బలహీనమైన జ్ఞాపకశక్తి లేదా మతిమరుపు సమస్యను పరిష్కరించడానికి ఇవి బాగా సహాయపడుతాయి.
రక్తపోటుతో బాధపడేవారికి కూడా పుచ్చకాయ విత్తనాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే అర్జినిన్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పుచ్చకాయ విత్తనాల్లో బి కాంప్లెక్స్, విటమిన్లు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి.