మండుటెండను సైతం లెక్కచేయకుండా అమర్నాథ్ వెంట నడిచిన మహిళలు
గాజువాక: మండుటెండను సైతం లెక్కచేయకుండా పెద్ద ఎత్తున మహిళలు అమర్నాథ వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక 66 వార్డులోని కైలాస నగర్ తదితర ప్రాంతాలలో కార్పొరేటర్ ఇన్ ఇమ్రాన్ నేతృత్వంలో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మంత్రి అమర్నాథ్ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్న పిల్లలను భుజాన వేసుకొని మహిళలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గమనార్హం. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ప్రచారంలో మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. ప్రచారంలో భాగంగా అమర్నాథ్ ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల కరపత్రం అందజేసి తనకు ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. అలాగే చిరు దుకాణాలలోని వ్యాపారులను, కూరగాయలు అమ్మేవారిని అమర్నాథ్ సాదరంగా పలకరించి తనకు ఓటు వేయాలని కోరారు. తామంతా జగన్ అభిమానమని, మీకే ఓటు వేస్తామంటూ అమర్నాథ్కు వారు భరోసా ఇచ్చారు. అలాగే ముస్లిం సోదరులు అమర్నాథ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించారు, అలాగే గాజువాక మార్కెట్లోని ఆటో డ్రైవర్లు కూడా మంత్రి అమర్నాధ్ను సత్కరించారు. తామంతా వైసిపి విజయానికి సహకరిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి పేదలకు అండగా నిలిచి, సంక్షేమ పథకాలను నిరంతరం అందజేస్తున్నారని చెప్పారు. పేదలకు మంచి జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలని అందుకు ప్రతి ఒక్కరు వైసీపీకే ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి మద్దతు ఇచ్చినట్టే అవుతుందని అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు అబద్దాలను నమ్మదని, ఆయన అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందవు అని అమర్నాథ్ చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు,రెడ్డి జగన్నాధం, షాకత్ అలి,పెడిరెడ్ల ఈశ్వర్ రావు, వురుకుటి అప్పారావు,ఉమ, కాజీ అలిజన్ హజరత్,సర్కార్ భాయ్ , ఖలీల్ రెహ్మాన్,బాషా, షఫీ,రబ్బాని, ఖలీల్,రఫీ,మొల్లి చిన్న,ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.