జగ్గంపేట :సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం శిథిలావస్థలో ఉండడంతో తాత్కాలికంగా కోనేటి వీధిలో గల పాత మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి 10 లక్షల రూపాయల తో ఆధునికరించి బాలురకు వసతి కల్పించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విద్యుత్ సమస్య ఎక్కువగా ఉండడంతో విద్యార్థులకు ఇబ్బందులుగా ఉన్నాయని వార్డెన్ ప్రభాకర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కు తెలియజేయడంతో ఆయన వెంటనే రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి అన్నవరం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు కొత్త కొండబాబుకు ఇన్వర్టర్ బహూకరించమని కోరడం ఆయన ఆదివారం 21 వేల రూపాయలతో కొనుగోలు చేసిన ఇన్వేటర్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా హాస్టల్ వార్డెన్ కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఆదినారాయణ, బద్ది సురేష్, పాలకుర్తి లక్ష్మీపతిరావు, యర్ర పరమేష్ తదితరులు పాల్గొన్నారు.