ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఐ&పీఆర్ మంత్రి
అయితే కచ్చితంగా వస్తా..
వాస్తవాలు తెలుసుకుంటాం..
పత్రికా సంపాదకులతో మంత్రి సారథి ..
ప్రజాభూమి ప్రతినిధి,అమరావతి:
అదేమిటీ పత్రికల ప్రదర్శన నా ..గతంలో ఎన్నడూ వినలేదు. .చూడ లేదనుకుంటా…అయితే అదేమిటో చూస్తా అన్ని వివరాలు తెలుసుకుంటానని సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో ని మంత్రి కార్యాల యంలో ఆంద్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సం ఘం మర్యాద పూర్వకంగా కలిసి రాష్ట్రస్థాయి పత్రికల ఎడిటర్స్ ఆత్మీయ సమావేశం ఈ నెల 24వతేదిన విజయవాడ గాంధీనగర్ గ్రంధాలయ ప్రాంగణంలో నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా రావాలని మంత్రిని కోరగా ఆయన స్పందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోశించ దగ్గ విషయ మని ఆయన కొనియాడారు. సమావేశా లు నిర్వహించి ఏదో ఒక కొత్త మార్పు దిశగా అడుగులు వేయడం ఆది కూడా పత్రికల ప్రదర్శన అనేది కొత్త అంశమని తప్పక హాజరై నిశితంగా పరిశీలించి తాము ఏ విదంగా పత్రికలకు అండగా ఉండాలో చూస్తామని మంత్రి పార్థ సారధి తెలియ జేశారు.ఈ కార్యక్ర మంలో అధ్యక్షుడు కూర్మ ప్రసాద్ బాబు,ప్రధాన కార్యదర్శి రామమోహన్ రెడ్డి,సీనియర్ పాత్రికేయులు శ్రీరామ్ యాదవ్,గణపతి రావు తదితరులు పాల్గొన్నారు.
శభాష్ …ఇది గొప్ప కార్యక్రమం..మునిసిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర…
పత్రికా సమావేశాలు చూసాము కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని పత్రికల ఎడిటర్స్ ఓకే చోట సమావేశం అయ్యి ఒక విధానాన్ని పాటించే విధంగా ముందుకు తీసుక వెళ్లే కార్యక్రమం నిర్వహించడం శుభపరిణామని విజ యవాడ మునిసిపల్ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు.శనివారం ఆంద్రప్రదేశ్ పత్రికా సంపాదకుల సంఘం ఆధ్వర్యంలో ఆయన్ని మర్యాదపూర్వం కంగా కలిసి ఈ నెల 24వతేది జరగబోవు రాష్ట్ర స్థాయి పత్రికా సంపాదకుల ఆత్మీయ సమా వేశం కు ఆయన్ను ఆహ్వానించగా ఆయన పై విధంగా అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కూర్మ ప్రసాద్ బాబు,ప్రధాన కార్యదర్శి రామమోహన్ రెడ్డి,సీనియర్ పాత్రి కేయులు శ్రీరామ్ యాదవ్, గణపతి రావు, శ్రీనివాస్ , రాజా, మన్మధ రావు తదితరులు పాల్గొన్నారు.