Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుఆహా….ఈ గంధం ప్రసాద్ మహా గడుసరి సుమ..

ఆహా….ఈ గంధం ప్రసాద్ మహా గడుసరి సుమ..

-తిరుమలేసుడి ప్రసాదం ధర
చాలా తక్కువ
-ఈ గంధం ప్రసాదం
దక్కాలంటే ధర ఎక్కువే..
-అలా దండుకున్నాడు ..
దోచుకున్నాడు ..
-అందుకున్నాడు రెండు నోటీసులు…
-అటు విశాఖ ..ఇటు బెజవాడ..
-అక్రమ కట్టడాలకు అన్నీ తానై…
-అప్పనంగా దోచుకుని దాచుకొని…
-అంతా ఆ మల్లికార్జునుడే ..
అందరికి ఆయనే ..
-కట్టడం ఏదయినా కప్పం కట్టించి..
కార్పొరేషన్ కు గండికొట్టి
జేబులు నింపుకుంటూ…
-ఈ మల్లికార్జునుడి లీలలే వేరు…

-ఏ అధికారి అయినా ఈ మల్లికార్జున సేవలో మునిగిపోవాల్సిందే..
-అందుకు అన్నీ ఫ్రీ…విందు… పొం…….ఫ్రీ..ఫ్రీ..
-కట్టడాన్ని బట్టి కరెన్సీ పెరగడం…కాదంటే కూల్చివేతే…
-ఇందులో పై అధికారుల
వాటా ఎంత…
-వీరి అక్రమాల్లో ఏసీపీ, డీసీపీ,సీపీ ల పాత్రమేమిటీ…
-కొత్త కమిషనర్ కన్నెర్ర చేస్తాడా.. కామ్ అవుతాడా…
-ఆ మల్లికార్జునుడి కబంధ హస్తాల్లో కూరుకు పోతాడా…
-విరమణ చెందితే ఇవన్నీ వదిలేస్తారా…
-విచారణ జరిపి వేటు వేస్తారా…
లేక విందుకు పాం…కు
మురిసి పోతారా..
-ధ్యానచంద్ర గారి ధ్యాస ఎటువైపు…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె నక్కల వలె…మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలే అనిమహాకవి శ్రీ శ్రీ గారు చెప్పినట్లు…అవును మనం కుక్కల మేసందుల్లో… పందుల్లా తిరుగుతు…పైసలకోసం చంపేస్తూ…నరరూప రాక్షసుల్లా నడివీధుల వెంబడి సిగ్గు ఎగ్గు లేకుండా కాసుల కోసమే కార్పొరేషన్ కు గండికొట్టి తమ జేబులు నింపుకొని జల్సాలతో జీవితాన్ని గడి పేస్తుంటే గరీబోడు గంపేడంత ఆవేదనతో గుండె పగిలేలా విలపిస్తున్నాడు వీరి తీరును చూసి. అవినీతి అనేది సగటు మనిషిలో ఒక ప్రధాన భాగమైంది.
ఓవైపు పేద ప్రజలు తమ రక్తాన్ని చిందించి కూడబెట్టిన పైసా తో టాక్స్ లు చెల్లిస్తుంటే ఆ టాక్స్ లు ప్రభుత్వాలు జీతాలు రూపంలో ఉద్యోగస్తులకు ఇస్తున్నా ఇంకా వారి జల్సాల కోసం జనం సొమ్ము కాజేయడానికి కక్కుర్తి పనులు చేస్తూ కడుపులు నింపుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నారు ఈ గడుసరి గంధం ప్రసాద్ లంటే అధికారులు. తమ ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడమే కాకుండా సమాజ హితం మరిచి నమ్మి అప్పజెప్పిన బాధ్యత లను భేషరత్ గా ప్రక్కన పెట్టి నడి బజారులో న్యాయాన్ని వేలం వేసి తద్వారా వచ్చిన రూపాయి తీసుకుని అనేక విధాలుగా రూపాంతరము చెందుతున్నారు. ముఖ్యంగా గంధం ప్రసాద్ పనిచేసిన ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు చూస్తే ఆచ్చర్య పోతారు అధికారులు. లంచాల కోసం లుచ్చా పనులు చేయడానికి ప్రత్యేకంగా ఒక ప్రవేటు టీమ్ ఏర్పాటు చేసుకుని సఫరేట్ గా కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడ కొత్త మున్సిపల్ చట్టాలు తయారు చేసాడు ఈ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ గంధం ప్రసాద్.


అలా కాక పోతే అటు విశాఖ లోను,ఇటు విజయవాడలోను అక్రమ కట్టడాల వెనుక ఈ బీల్డింగ్ ఇన్స్పెక్టర్ గందం ప్రసాద్ పాత్ర ఉందని విజిలెన్స్ అధికారులు రెండు సార్లు ఇతనిపై ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ నుండి చర్యలకీ సిఫార్స్ చేయడం… కొంత మేర చర్యలు తీసుకున్నారు. ఇదంతా కూడా ఎప్పటి నుంచో జరుగుతున్న ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోనే ఈయన గారి అరాచకాలు ఎక్కువ అయ్యాయని చెప్పాలి.కారణం కాసుల కోసం అర్రులు చాచి ఉన్న వైసీపీ కార్పొరేటర్లు ఇలాంటి అవినీతి అధికారి కోసం ఎదురుచూపులు చూస్తూ ఉండడం.ఇంకేముంది ఒన్ టౌన్,వినాయకగుడి,రామకృష్ణాపురం ముగిసి భవాని పురం లో ఎంటర్ అయ్యాడు.ఇక మొదలు వందలాది అక్రమ నిర్మాణాలు నీకింత నాకింత కార్పొరేటర్ లతో కలిసి కుమ్మేసి శుభ్రంగా చేతులు దులుపుకొని దుస్సాలువతో ఉద్యోగ విరమణ చేయబోతున్నాడు. అయితే ఇక్కడ గొప్ప గొప్ప ట్విస్ట్ లు ఉన్నాయి… లంచాలు ఇవ్వకపోతే కట్టడాలు కూల్చివేసిన సంఘట లు బోలెడు ఉన్నాయి..స్థానిక కార్పొరేటర్ లతో కలిసి కుమ్మక్కై మల్లికార్జునుడి తో కలిపి మూటలు కట్టుకుని ముచ్చటగా మున్సిపల్ శాఖకు పంగణామాలు పెట్టారు వీరంతా కలిసి.వీరి దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇన్ని నేరాలు ఘోరాలు కళ్లెదుటే కనిపిస్తున్న కట్టడి చేయాల్సిన అధికారులు చేష్టలుడిగి ఉన్నారు.ఈ తప్పుడు పనుల్లో పై అధికారులు చోద్యం చూసారా లేక వీరి అవినీతి లీలల్లో మునిగిపోయారో తెలియడం లేదు.కొత్తగా కమిషన్ బాధ్యతలు తీసుకున్న ధ్యాన చంద్ర అయిన ఈ అక్రమ నిర్మాణాలు, అవినీతి అధికారుల భరతం పడతారా లేక ఈ అవినీతి పరులు చెప్పుకుంటు తిరుగుతున్నట్లు ఆమ్యామ్యా కు అలానే అంటాడా చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article