Friday, November 29, 2024

Creating liberating content

టాప్ న్యూస్తాను మళ్లీ వైసీపీలోకి రావడానికి గల కారణాన్ని చెప్పిన ఆర్కే

తాను మళ్లీ వైసీపీలోకి రావడానికి గల కారణాన్ని చెప్పిన ఆర్కే

గుంటూరు:మళ్లీ వైసీపీ గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎం జగన్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఓడించాలని అన్ని పార్టీలు ఎలా ఏకం అయ్యాయో, ఇప్పుడు జగన్ ను ఓడించడానికి కూడా పార్టీలు ఏకం అయ్యాయని… అది జరగకూడదన్న ఉద్దేశంతోనే మళ్లీ వైసీపీలోకి వచ్చానని ఆర్కే వివరణ ఇచ్చారు. పేదవాడు గొప్పవాడు కావాలి… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు వెళ్లాలి… ఆ దిశగా అడుగులు వేస్తున్న జగన్ కు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే వైసీపీలోకి తిరిగొచ్చానని చెప్పారు. ‘అన్నా, మంగళగిరిలో మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టినా, ఆ అభ్యర్థి కోసం పూర్తిస్థాయిలో, బేషరతుగా కృషి చేస్తాను’ అని సీఎం జగన్ తో చెప్పానని వెల్లడించారు. మంగళగిరిలో వరుసగా మూడోసారి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పాటుపడతానని చెప్పానని వివరించారు.ఏ ఏ నియోజకవర్గాల్లో తన సేవలు అవసరమవుతాయో పార్టీ సమన్వయకర్తలు నిర్ణయిస్తారని, దాన్ని బట్టి తాను ఆయా నియోజకవర్గాల్లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్ మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈసారి ఎన్నికల్లో వైసీపీ 175కి 175 గెలవాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.ఈసారి మంగళగిరి సీటు బీసీలకు ఇస్తున్నారని ఆర్కే సూచనప్రాయంగా తెలిపారు. మంగళగిరిలో లోకేశ్ 2019లో ఓసీ చేతిలో ఓడిపోయారని, ఈసారి బీసీ చేతిలో లోకేశ్ ఓడిపోబోతున్నాడని ఆర్కే వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article