Saturday, November 30, 2024

Creating liberating content

సినిమాప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు చూస్తోంది

ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు చూస్తోంది

“ప్రస్తుతం ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు చూస్తోంది. మాటల్లో చెప్పలేనంత ఆదరణ దక్కుతోంది. తెలుగు నటీనటులకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాలి’’ అని అల్లు అర్జున్ అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన దర్శకుల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో దర్శకులు అనిల్‌ రావిపూడి, శ్రీరామ్‌ ఆదిత్య, శైలేష్‌ కొలను, శివ నిర్వాణలాంటి యువ దర్శకులు తమ స్టెప్పులతో అభిమానులను అలరించారు. అనంతరం.. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ కు దర్శకుల సంఘం తరఫున ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ‘దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని దర్శకుల దినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నామని ప్రకటించినప్పుడు ఎంతో సంతోషం కలిగిందని దాసరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ స్ఫూర్తితో సినీ పరిశ్రమలోని 24 శాఖల్లో వివిధ విభాగాలు ముందుకొచ్చి వేడుకలు నిర్వహించుకోవాలి. దానికి నా తరఫున నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది’ అన్నారు.ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌, మురళీమోహన్‌, విజయేంద్రప్రసాద్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, శ్యామలాదేవి, మారుతి, నాని, అల్లరి నరేష్‌, అడవి శేష్‌, ఆనంద్‌ దేవరకొండ, సుధీర్‌బాబు, కార్తికేయ, హరీష్‌శంకర్‌, వంశీ పైడిపల్లి, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్‌.శంకర్‌, మెహర్‌ రమేష్‌, యెల్దంది వేణు, వశిష్ట, చంద్రమహేష్‌, అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article