ఈ ఆత్మకథలో ఆడదానికి అవమానాలు ఎన్నో…..
అండగాఉన్నామంటూనే , ఉండకపోగా అవమానాలు యేల..!
గాయపడ్డ గాయని చేసిన తప్పేంటి..!
గాయపడ్డ గాయని గాయాలు కూడా బాధ కలిగించలేదా..!
గాయపరిచిన గాయానికి గోడకుర్చీ నే సరైన శిక్ష నా..!
గాయాలతో వెళ్లినా రక్షక బట్టులకు రక్తపు మరకలు కనిపించలేదా..!
రక్త గాయాలు చూసి రక్షించలేని పోలీసులు ఎందుకు..!
పెప్పర్స్ ప్రే కొట్టడమే పెద్ద నేరమా..!
మరి నాడు లగడపాటికి ఏ శిక్ష వేశారు..!
నేడేందుకు గాయపడ్డ గాయనిపై మచ్చ వేస్తున్నారు..?!
ఇదే నా చట్టం, ధర్మం, న్యాయం..!
ఏది న్యాయం?! ఏది అన్యాయం?!”
కృష్ణ సింధు,ప్రజాభూమి ప్రతినిధి,కల్చరల్ అండ్ క్రైమ్
ప్రణమ్యా మాతృదేవతాః “ప్రత్యేకంగా ఏదో ఒకరోజున మాత్రమే కాకుండా అనుక్షణం మహిళను గౌరవించే ఏకైక సమాజం భారతీయ సమాజం.మాతృదేవోభవ అంటూ అమ్మను తొలిదైవంగా భావించింది భారతీయ సమాజం.మాతృవత్పరదారేషు – పరస్త్రీని కన్నతల్లిగా భావించాలని ఉద్భోధించింది భారతీయ సమాజం. ఎక్కడ మహిళలు గౌరవింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారని తెలియజెప్పింది భారతీయ సమాజం. కుటుంబాన్ని తద్వారా సమాజాన్ని సంస్కరించే గురుతరమైన బాధ్యతను గృహిణిగా మహిళకు అప్పజెప్పింది మన భారతీయ సమాజం. భూమితో బాటు సమస్త ప్రకృతిని మాతృ స్వరూపంగా భావించి ఆరాధిస్తుంది మన భారతీయ సమాజం. నరకాసుర సంహారంలో పరమాత్ముడికి సహాయపడి మహిళ సబల అని నిరూపించింది మన సత్యభామ. తను ఎంతగానో ప్రేమించి, అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు శ్రీరామచంద్రుడిని ధర్మరక్షణ నిమిత్తం అడవులకు పంపించింది మన కౌసల్య. రాముడిని అనుసరించి అన్ని కష్టాలు అనుభవించినా మనోధైర్యానికి ప్రతీకగా నిలిచిన అమ్మ సీత. దుష్ట ఆక్రమణకారుల నుండి దేశాన్ని , సమాజాన్ని రక్షించడం కొరకు తన కుమారుడు శివాజీని వీరుడిగా తీర్చిదిద్దింది జిజియామాత.కాకతీయ మహా సామ్రాజ్యం పునాదులు కదిలించాలని చూసిన శతృమూకల పీచమణచి మహాసామ్రాజ్ఞగా వెలుగొందిన వీరనారి రుద్రమదేవి. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని భుజాన శిశువు, చేతిలో ఖడ్గాన్ని ధరించి ఆంగ్లసైన్యంతో వీరోచితంగా పోరాడింది వీరనారి ఝాన్సీలక్ష్మి.ఒక్క వాక్యంలో చెప్పాలంటే సృష్టి ఆదిగా మహిళలకు విశేషమైన, గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించింది భారతీయసమాజం. అన్నిరంగాలలో రాణించి కీర్తిప్రతిష్ఠలు గడించారు మన మాతృమూర్తులు. దేశ, ధర్మ రక్షణలో అగ్రస్థానాన్ని ఆక్రమించారు మన మహిళలు.ఎక్కడ స్త్రీలను పూజిస్తారో, అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు.. భారతీయ సమాజంలో మహిళలకు మొదటి నుంచీ ఉన్న గౌరవనీయ స్థానం ఇది.. పురుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కాస్త ఎక్కువ ప్రాధాన్యతే మహిళలకు ఉంది. మన దేశాన్ని భారత మాతగా కొలుస్తున్నాం.. మన పురాణాలను గమనించినట్లైతే దుర్గామాత, పార్వతి, పోచమ్మ ఎల్లమ్మ తదితర దేవతలను శక్తికి ప్రతీకగా, సరస్వతి, లక్ష్మిలను చదువు, సంపదకు గుర్తులుగా పూజిస్తాం..దురదృష్టవశాత్తు మన దేశంపై విదేశీయుల దండయాత్రలు మొదలయ్యాక పరిస్థితి మారింది.. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.. మరోవైపు మూఢనమ్మకాలు పెరిగాయి.. దీంతో స్త్రీలను ఇంటికే పరిమితం చేయడం మొదలు పెట్టారు.. అయినా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీభాయి, చెన్నమ్మ తదితర వీర వనితలు తమ శక్తి సామర్ధ్యాలను చాటుకున్నారు..ఇక ఆధునిక యుగంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులకు ధీటుగా దూసుకుపోతున్నారు.. రాజకీయ, పరిపాలన, వ్యాపార రంగాల్లో ఎందరో మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నారు.. అయినా ఎక్కడో లోపం.. ఇవన్నీ పైపై మెరుగులేనా అనిపిస్తుంది.పొద్దున్నే పేపర్ తెరచినా, టీవీ ఛానళ్లు చూసినా ప్రముఖంగా కనిపించే వార్తలు బాధను కలిగిస్తుంటాయి.. మహిళలపై వివక్ష దారుణంగా కొనసాగుతోంది.. బాల్య వివాహాలు, అవిద్య చాలా మేరకు తగ్గినా, మహిళలపై అత్యాచారాలు, హింస, వరకట్న వేధింపులు చూస్తుంటే మనం నిజంగా అనాగరికులమేనా అనే సందేహం కలుగుతుంది.. సామాజికంగా, రాజకీయంగా వివక్ష దారుణంగా ఉంది.. రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ల పుణ్యమా అని పదవులు మహిళలకు దక్కినా పెత్తనం మాత్రం పురుషులదే.. అత్యున్నత స్థానంలో ఉన్న మహిళలదీ ఇదే దుస్థితి.. మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల బిల్లుకు మాత్రం మోక్షం కలిగే పరిస్థితి కనిపించడంలేదు..మనం ఆధునికులం అని చెప్పుకుంటున్నాం.. కానీ మన ఆలోచనా విధానం పూర్తిగా అనాగరికంగా ఉంది.. స్త్రీని భోగ వస్తువుగానే చూస్తున్నాం.. మహిళల కట్టు, బొట్టు గురుంచి కామెంట్ చేయడం గౌరవ ప్రదం అనిపించుకోదు.. పురుషుల వస్త్రధారణ మారినట్లుగానే మహిళలదీ మారుతోంది అని నా అభిప్రాయం.. ఈ విషయంలో స్త్రీలను ఎంత తప్పు పడుతున్నామో, పురుషులకూ అంతే బాధ్యత ఉంది.. మనం భారతీయులం అనే విశిష్ట గుర్తింపును నిలుపుకునేందుకు మన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.. అసలు మహిళల హక్కులు, గౌరవం, ప్రాధామ్యాల విషయంలో పోరాటాలు చేసే దుస్థితి ఎందుకు?.. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.. సృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే.. ఏ ఒక్కరు లేకున్నా ప్రకృతి అనేది ఉండదు.. పురుషులకన్నా ఏ విధంగానూ స్త్రీ తక్కువ కాదు..మార్పు అనేది మన కుటుంబాల నుంచే రావాలి.. మన ఇళ్లలోని మహిళా మూర్తులను గౌరవించాలి.. ఆడ పిల్లలను మగ పిల్లలతో సమానంగా చదివించాలి.. వారు స్వశక్తిపై ఎదిగేందుకు తోడ్పడాలి.. అప్పుడే సమాజం మారుతుందని భావించిన ఓ తండ్రి చిన్నతనం నుండి తన గారాల పట్టికి గానాన్ని నేర్పిస్తూ, గాయనిగా చూడాలన్న కోరికను, సార్థకం చేసుకున్నాడు.అలా అల్లారుముద్దుగా పెరిగిన గాయని జీవితం ప్రగాడoగా సాగుతున్న సందర్బంలో, ఒక అనుకోని దుస్సంఘటన జరిగింది.ఆ దుస్సంఘటన వివరాల్లోకి వెళితే….. -గాయపడ్డ గాయని సహజంగా తండ్రి నుంచి పాటలను నేర్చుకుని, తన పాటలను వివిధ స్టేజీల మీద వినిపిస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న నేపథ్యంలో అది గ్రహపాటో, తొందరపాటు, అవివేకమో, ఆనాడు తన కుటుంబంలోని పరిస్థితుల దృశ్యం తాను వ్యక్తిగతంగా కొత్తగా వచ్చిన గాయకుడు గానానికి పరవశించిపోయి, పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి వరకు వెళ్లి తన కుటుంబాన్ని తను విచ్చిన్నం చేసుకునేందుకు కూడా సిద్ధపడే స్థాయికి దిగజారి పోయే విధంగా కౌతా కళా రంగం భ్రమలు కురిపించింది. ఏ గాయకుడితో తన గానాన్ని కలిపి ఆలపిస్తే శృతిలయల సంగమం బాగుంటుందని భావించిన అతి కొంత కాలంలోనే, ఈ గాయపడ్డ గాయనికి ఘోరమైన నిజాలు తెలిసినప్పటికీ, గుండెని రాయి చేసుకొని బరువెక్కిన హృదయంతో, ప్రేమ అనే వ్యామోహంతో, భరించటానికి సిద్ధపడిన కూడా ఆ భగవంతుడు ఆ గాయకున్ని, ఈ లోకానికి, గాయపడ్డ గాయనికి దూరం చేశాడు. తదనంతరం పరిణామ క్రమంలో తన మనసుకు కలిగిన గాయాన్ని మాన్పించుటకు, అనేక స్నేహితులు, పెద్దలు, తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త ఆదరణతో అడుగడుగునా అండగా నిలబడటంతో ధైర్యం కోల్పోకుండా గాయనిగా ఎదుగుతూ వస్తుంది. సహజంగా గాయనీ గాయకుల మనస్తత్వాలు ఎలా ఉన్నప్పటికీ సమాజంలో తమకు బాధలు ఎన్ని ఉన్నా దిగమింగుకొని ప్రేక్షకులను సంతోషపెట్టాలి. కాబట్టి చిరునవ్వు, ఆప్యాయత, అనురాగం, అందరితో కలిసి ఉన్నట్లు నటించాల్సి ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా-కాదన్నా యదార్థం. ఈ క్రమంలో గాయపడ్డ గాయనిని ఓదారుస్తున్నామని, మనసులో వంకర బుద్ధి పైకి వల్లమాలిన ప్రేమ చూపిస్తూ, ఆ గాయపడ్డ గాయని గాయానికి మందు పూసే ప్రయత్నం చేయకపోగా ఓవైపు కాసులు రాబట్టుకునే ప్రయత్నం మరోవైపు గాయనికి జరిగిన గాయాన్ని పెద్దది చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వస్తున్న పెద్ద మనుషుల ముసుగులో ఉన్నవారు, ఈ కళా రంగంలో అనేకమంది ఉన్నారు. అయితే అసలే జీవితంలో కోలుకోలేని, చెరిపితే చెరిగిపోని మచ్చను తగిలించుకున్న గాయపడ్డ గాయనికి వందలాది మంది సమక్షంలో గానాన్ని వినిపిస్తుండగా, తాను ఒక గాయనిగా చలామణి చేయించుకుంటున్న ఓ మహిళ దాడి చేసి దారుణంగా హింసించి భావించటం జరిగింది. వీటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. గాయపడ్డ గాయనిని ఈ గాయని మళ్లీ ఎందుకు గాయపరిచిందో తెలియదు. జరిగిన దురదృష్టకర సంఘటనకు గాయనీ-గాయక లోకంలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ సంఘటనను ఖండించకపోగా సానుభూతి కూడా చూపలేని దౌర్భాగ్య స్థితికి కళా రంగం చేరుకుంది. ఈ దుస్థితిని కౌతాకు కూతవేటు దూరంలో ఉన్న పోలీసులను ఆశ్రయించిన ఫలితం దక్కకపోగా, రక్త గాయాలతో రక్షకబటుల ఎదుట నిలబడితే, గాయపరిచిన గాయనికి గోడకుర్చీతో సరిపెట్టేశారు. తెలిసో తెలియకో సమాజం ఏమనుకున్నా సరే గాయపడ్డ నాటి నుంచి, ఆనాటి గాయకుడికి సంబంధించిన బంధువులు, స్నేహితులు అనేక కుట్రలు చేస్తున్న విషయాలు తెలిసి, ఆత్మ రక్షణ కోసం రాజ్యాంగం కల్పించిన హక్కులకు లోబడి న్యాయ పరిధికి అనుసంధానంగా పెప్పర్ స్ప్రే ఎప్పుడూ కూడా తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాల్సిన ధారుణ స్థితి కొనసాగుతూనే ఉండటం, ఆ గాయని చేసుకున్న కర్మనా…? నాడు తగిలిన గాయానికి, యే మందు పూసినా ఉపసమనం ఈ లోకంలో లేదు. కానీ నిన్న గానాన్ని వినిపిస్తున్న సందర్భంలో సంబంధం లేని గాయని కౌతా ,వేదికకు రావటం అక్కడ చూసిన పరిస్థితులు అనుమానకరంగా ఉండి జాగ్రత్త పడేలోపే సమాజం సిగ్గుపడే విధంగా, అది అహంకారమా పొగరా లెక్కలేని తనమా లేక ఒక క్రూరత్వమా తెలియదు కానీ నిస్సిగ్గుగా ఆ గాయని దాడి చేయడం అత్యంత హేయమైన చర్య. స్త్రీ జాతికి కళంకితం తెచ్చే విధంగా దాడి చేసిన సందర్భంలో దాడిని ప్రతిఘటించలేక తనకు ప్రాణ రక్షణ లేదని భావించి ఆత్మరక్షణలో భాగంగా పక్కన ఉన్న పెప్పర్ స్ప్రే ను ఉపయోగించడం జరిగింది. అదేమీ నేరము కాకపోయినా దాన్ని కూడా నేరముగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు ఈ పోలీసులు. ఇక్కడ గాయపడ్డ గాయని తన ప్రాణ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడుట పెద్ద శిక్షగా భావించినట్లయితే, ఆనాడు రాష్ట్ర విభజనకు సంబంధించి ఉభయసభల్లో దేశ రాజధానిలో దేశం మొత్తం చూస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఎంపీ బిల్లుని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పెప్పర్స్ స్ప్రే వాడితే దేశమే కాక ప్రపంచమే నిద్రపోయింది. అయినా ఆ లగడపాటికి ఎలాంటి శిక్ష వేయలేదు. ఆ సంఘటనపై ఆ పార్టీ నాయకత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనపై ఎలాంటి మచ్చా వేయలేదు. అయినా ఆ బిల్లుని ఆపలేకపోయాడు కానీ నేడు ఇక్కడ పెప్పర్ స్ప్రే వాడకపోయి ఉంటే ప్రాణాలు పోలేవని గ్యారెంటీ ఇచ్చే అవకాశాలు కానీ, అవునని చెప్పే దమ్ము కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని భూతద్దం పెట్టి వెతికినా దొరకక పోయారే ఆ గాయపడ్డ గాయనికి. ఇవన్నీ తెలిసిన పోలీసులు కూడా నిర్లక్ష్యం చేయడంతో అసహనం, ఆవేదన, అంతుచిక్కని వ్యధ, ఆలోచనకు దక్కని స్థితి ఎదురు కావడంతో, ఇక న్యాయం దక్కదని నిరాశతో, ఇంకెన్ని గాయాలు తగిలించుకోవాలి, ఈ జీవితం అవసరమా అని భావించి తన ఆత్మ కథను డైరీలో మొదటి పేజీ మొదటి సంతకంతో మొదలుపెట్టి ఎన్ని పేజీలు రాసిన అంతుచిక్కని ఆవేదనతో ఆఖరి పేజీ వరకు అన్ని వివరాలు అందరి పాత్రలను అందరి పేర్లను అందుకు గల కారణాలను అక్షరాల రూపంలో రాసి ఆత్మ కథకు అంతం పలుకుదామని అనుకునే లోపు గాయపడ్డ గాయనికి ఈ లోకంలో ఇంకెన్ని గాయాలు అవ్వాలని రాసిపెట్టి ఉందో తెలియదు కానీ, ఆ ఆత్మకథ అంతం అవ్వకుండా ఓ శక్తి ఆపగలిగింది. ఆ శక్తి ,ఆమె కుటుంబ సభ్యులు అనుకోవచ్చు ఆమె స్నేహితులు శ్రేయోభిలాషులు కావచ్చు, ఆమెను అనుక్షణం అధైర్య పడకుండా స్ఫూర్తినిచ్చిన ఎందరో గొప్పవారు కావచ్చు. ఇలాంటి దురదృష్టకర సంఘటన ఏ గాయనికే కాదు, ఈ భూమి మీద ఉన్న “ఆడ” అనే రెండు అక్షరాల పదానికి ప్రమాదం వాటిల్లకూడదని, ఆ గాయపడ్డ గాయని తన గాధను ఈ విధంగా తెలియపరుస్తుంది. ఇది అంతులేని కథ లేక ఇంకేమైనా అనుకోవచ్చునెమో….!