33 మంది శిశు బృందానికి ఏపీ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులు
అనంతపురము
వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులకు
ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డు అసోసియేట్ విత్ తెలుగు సంస్కృతి సాహితీ సేవ ట్రస్ట్ (34 / 2023 రిజిస్ట్రేషన్ 11 /02/24) చేసిన జాతీయ పురస్కారాల్లో
అనంతపురము నగరానికి చెందిన ఓం సంగీత నృత్య శిక్షణ సంస్థ పురస్కారాలు దక్కించుకుంది. విజయవాడలో చిట్టి నగరు పుల్లేటికుర్తి ప్రసాదు విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆదివారం జాతీయ పురస్కారాలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో”స్వర్ణ నంది” అవార్డు గ్రహీత దేవరకొండ కౌసల్యతో పాటు ఆమె సంస్థకు చెందిన 33 మంది శిశు బృందానికి నిర్వాహకులు అవార్డులు ప్రదానం చేశారు.
ఈ మేరకు కౌసల్య సోమవారం అనంతపురంలో వివరాలు వెల్లడించారు. అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి
ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంతాచారి, అయోధ్య రాముని పాదుకుల రూపకర్త బ్రహ్మశ్రీ పిట్టంపల్లి రామలింగాచారి హాజరయ్యారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వారి చేతుల మీదుగా కళాకారులకు జాతీయ పురస్కారాలు అందించడం జరిగిందన్నారు. ఓం సంగీత నృత్య శిక్షణ సంస్థ శిష్యులు అద్భుతమైనటువంటి కోలాటం, చిన్నపిల్లల నృత్యాలు చాలా చక్కగా ప్రదర్శించారని, సంస్థ చైర్మన్ దేవరకొండ కౌసల్యకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని నిర్వాహకులు అభినందనలు తెలిపి కౌసల్యను సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు.