ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, త్వరలోనే కొత్త మద్యం విధానం అమల్లోకి రాబోతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుకు ముగుస్తున్న నేపథ్యంలో, కొత్త విధానం తయారుచేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ పాత మద్యం విధానంపై సమీక్ష జరిపి, కొత్త విధానం రూపొందించేందుకు అవగాహన పెంచనుంది.ప్రస్తుత విధానంలో ఉన్న లోపాలను గుర్తించడంతో పాటు, పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న మద్యం విధానాలపై సబ్కమిటీ అధ్యయనం చేస్తోంది. ఈ రాష్ట్రాల్లోని అధికారులు నిర్వహించిన పర్యటనల నివేదికను కూడా పరిశీలించనున్నారు.నూతన విధానాన్ని రూపొందించే క్రమంలో వివిధ వర్గాల అభిప్రాయాలను తీసుకోవడానికి సబ్ కమిటీ సిద్ధమవుతోంది, తద్వారా మరింత సమగ్రమైన విధానాన్ని రూపొందించాలనే లక్ష్యం ఉందని తెలుస్తోంది.