ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా మారిందన్న నరేందర్ రెడ్డి
ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అధ్యక్షుడు బూసిరెడ్డి నరేందర్ రెడ్డి స్పందించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు గత ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలని, కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా ఉందని అన్నారు. వైద్య ఉపకరణాలు పంపిణీ చేసిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని నరేందర్ రెడ్డి చెప్పారు. బకాయిలు రాకపోవడంతో ఇప్పటికే కొన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘాలు నోటీసులు ఇచ్చాయని తెలిపారు.