కొత్తవారికి సభ్యత్వం లేదు..
ఉన్నవారంతా వారి వారే నంట..
ఉద్ధరించడానికి ఐజేయు యూ ఉందట ..
అందుకోసం ఏదయినా చేస్తారట..
దండలేసుకోవడానికి డెహ్రడూన్ వెళ్లారట..
ఇక్కడ ఉన్న దరిద్రం తొలగించేది లేదు..
డెహ్రాడూన్ వెళ్లి సుదీర్ఘంగా చర్చలట..
ఇక్కడ దోచుకున్నారా…దాచుకున్నారా ..లెక్కలేదు..
ఉన్న అప్పులు తీరేదెలా… కొత్త అప్పులు కట్టేదెలా..
కార్మిక శాఖ అనుమతి లేదు…కోరికలన్నీ తీరుస్తాననడంలో…?
సొమ్ము ఏపీది సోకులు తెలంగాణ వారిది..
వారు తన్ని తరిమివేసినా వారే వీరికి మార్గదర్శనం..
దేనికోసం… ఎవరి కోసం ఇదంతా..
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పారు అనాటి పెద్దలు.ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా’ అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధులున్నారు.ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయతీగా, నిర్భీతిగా ఉండాలని కోరిన పాత్రికేయుడు నార్ల. “నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా” అని కుండ బద్దలుగొట్టినట్లు చెప్పడం నార్లవారికే చెల్లింది. అంతటి విలువను కలిగిన పత్రికలలో పనిచేసి ప్రజా సమస్యలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిస్కారం కొరకు ఎంతో కొంత కృషి చేయుట లో పత్రిక ల పాత్ర చాలా కీలకమైనదని ఆనాడు ఉండేది. ఒక సమస్య పరిష్కారం కేవలం పత్రిక లో ప్రచురితమైతే ఆ కథనాలకు కచ్చితంగా సంబందిత అధికారులు లేక ఆ సమస్య కు మూలమైన వారు తప్పు ఒప్పులు బట్టి తగిన చర్యలు తీసుకుని తీరాల్సిందే. అదే పత్రిక గొప్పతనం. స్వాతంత్ర్య పోరాటం లో కూడా పలు పత్రికలు తమ ప్రతిభను చూపించి పోరాట స్ఫూర్తిని చూపించారు. అలానే ఎందరో పాత్రికేయులు తమ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఇలా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో పతనమవుతున్న పాత్రికేయు విలువలు అకారణంగా పోతున్న పోగొట్టుకుంటున్న ప్రాణాలను కొంత మేర నియంత్రణకై అన్ని వర్గాలకు సంఘాలు ఉన్నట్లు జర్నలిస్టుల సంఘాలు వెలిసాయి. అయితే ఆ సంఘాలు స్థాపనకు ఆనాటి ప్రభుత్వ పెద్దలు కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించి పాత్రికేయ కుటుంబాలకు కొంత ఊరట క్షల్పించారు.అందుకు అనేకమంది పాత్రికేయలు హాయిగా జీవించే అవకాశం ఉందని అసపడ్డారు.కానీ నాటి నుండి నేటి వరకు అన్నీ పరిస్థితులు గమనిస్తే జర్నలిస్టుల సంక్షేమం అన్నది చిట్టచివరి జర్నలిస్టువరకు వచ్చే సరికి అందని ద్రాక్ష పుల్లనా అన్నట్లు తయారైనది. దీనికి కారణాలు ఉన్నాయి. వాస్తవానికి జర్నలిస్టుల సంఘాలు ఎంత మంది జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉన్నాయన్నది అనే దానికంటే అక్కడ జరుగుతున్న లోపాలు చూస్తే ఆచర్యపడాల్సిన దుస్థితి నెలకొంది. కారణం సంక్షేమం ముసుగులో సంక్షోభం సృష్టించి జర్నలిస్టుల జీవితాల్లో చీకట్లు నింపే విధంగా తయారయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ గా అవతరించి తమకు అడ్డు అదుపు లేదని అనేక రకాలుగా ప్రయోజనం పొందడమే కాకుండా అసలైన అజెండాను వదిలి రాజకీయ పార్టీలు జెండాలు భుజాన వేసుకుని అసలైన పార్టీ కార్యకర్తలకంటే అద్వాన్నంగా దిగజారిపోయి తాము మాత్రం ఆయా పార్టీల అండదండలతో అత్యున్నత పదవులు పొందారు.పోనీ పదవులు పొందిన వారు కనీసం పదిశాతం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏదయినా చేసారా అంటే అది అమాత్య అని అనిగిమనిగి ఉన్నవారికి చేసినట్లు తెలుస్తోంది. ఇలా జరుగుతున్న నేపద్యంలో రాష్ట్ర విభజన జరగడం తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ వారు తన్ని తరినివేశారు.ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్ లు రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేకంగా యూనియన్ లు ఏర్పాటు చేసుకొని తమ సమస్యలను పరిస్కారం కొరకు పోరాటాలు చేస్తుంటే ఒక్క అతిపెద్ద యూనియన్ తాము తలుచుకుంటే ఈ దేశ గతిని కూడా మార్చగలం అని డెహ్రడూన్ ఊటీ లూటీ కోటి ఇలా అనేక రాష్ట్రాలలో తమ ఆరాటం చూపిస్తున్న అత్యున్నత మేధావులు అసలైన రాష్ట్రంలో అడ్రస్ కూడా లేకుండా ఆర్భాటాలు ప్రదర్శిస్తుంటే అంతా అవాక్కవుతున్నారు. అడ్రెస్ లేని వారే అత్యున్నత మైన స్థాయిలో ఉండాల్సిన జర్నలిస్టుల ను అతినీచంగా దిగజారి పోయి అందరికి వర్తింపచేయాల్సిన అన్నీ కుడా అతికొద్ది మందికి మాత్రమే అన్నట్లు చేస్తూ అత్యంత దారుణంగా ప్రవర్తిస్తుంటే పాత్రికేయ లోకం ఇంత నీచమైన స్థాయికి చేరుకొందా అంటూ పలువురు ప్రముఖులు అసహ్యించుకుంటున్నారు. అయినా లెక్క చేయని వారి లెక్క చూడాలని చూస్తే ఆనాటి నుండి ఈ నాటివరకు కేవలము అక్షరాల కొన్ని కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నట్లు ఆఖరికి ఆడంబరాలు చూపుకునే ఆ యూనియన్ పేరు గోడలమీద వేసుకుని ఆర్భాటం చేసే ఆ బీల్డింగ్ అద్దె నీరు ఇతర బకాయిలు అక్షరాల రెండుకోట్లు మాత్రమే బకాయిలు పడ్డారని చూసి సంభ్రమాచ్చార్యానికి గురవుతున్నారు. ఇన్ని రకాల విమర్శలు వెల్లువెత్తుతున్న ఇంకా తమ ఆర్భాటాలు ఏమాత్రం తగ్గకుండా తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం లో ఎంతోమంది జర్నలిస్టులను అయోమయానికి గురిచేస్తుంటే విజ్ఞులైన వారు ఇదేమిటిరా అయ్యా అంటూ అవాక్కు వతున్నారు. మరి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మారుతుంది ఇంకెన్నాళ్లీ ఈ దురాఘాతాలు చూడాలని పలువురు జర్నలిస్టులు ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో..