న్యూఢిల్లీ:ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. లిక్కర్ స్కాం కేసులో ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు హాజరుకావడం లేదని ఈడీకి ఆయన సమాచారమిచ్చారు. ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతున్న తరుణంలో ఈడీ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్దమని ఆప్ ఆరోపించింది. కోర్టు నిర్ణయం వచ్చేంతవరకు దర్యాప్తు సంస్థ ఆగాల్సిందేనని తెలిపింది ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడం ఇది ఆరోసారి. గతంలో 5సార్లు నోటీసులు జారీ చేయగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నెల 17న వర్చువల్గా కేజ్రీవాల్ కోర్టు విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. ఇక మార్చి 16న కేజ్రీవాల్ స్వయంగా కోర్టుకు హాజరుకానున్నారు.