Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలురెవెన్యూశాఖ ఉన్నట్టా.. లేనట్టా…

రెవెన్యూశాఖ ఉన్నట్టా.. లేనట్టా…

సినిమా తరహాలో రేషన్ మాఫీయా ఆగడాలు..
బహిరంగంగానే ముష్టి యుద్దాలు…
వంత పాడుతున్న రాజకీయ పార్టీలు…
పేరుకే పేదల బియ్యం… తినేది పెద్దోడే…
ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు లోనే అధికం
కూటమిలో కుట్రలు బట్ట బయలు..
రూపాయి కోసం ఏ రూటు వదలని వైనం..
నాడు వారిది నేడు వీరిది అన్నట్లుగా…
ప్రభుత్వాలు మారినా పలితం శూన్యమేనా…
ఆజ్యం పోస్తున్న యూట్యూబర్స్…
దిగజారి పోయిన జర్నలిజం…
యర్నలిస్టులతోనే ఈ యవ్వరాలు…
దండుగా నిలిస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా…
కాసుల కోసం కక్కుర్తి ..కుట్రలు…
చిత్త శుద్ధి లేనిమీడియాతో మాఫీయా ఆగడాలు…
మీడియాను పావులుగా వాడు కొంటున్న పొలిటికల్ మాఫీయా ..
మాఫీయా అడుగులకు మాడుగుల ఒత్తుతున్న నకిలీ మీడియా..
నిస్తేజంగా పోలీసులు.. పోలీసుల్లో కుట్రలు కుతంత్రాలు..
ఇదీ మన ప్రజాస్వామ్య వ్యవస్థ…
చెప్పు కోవడానికే గొప్పలు…అంతా అవినీతే…
మీడియా ఏరివేత చేస్తేనే పెనుప్రమాదం తప్పుతుంది..
ఆ సాహసం కూటమి ప్రభుత్వం చేస్తుందా…

(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
“ధనం మూలం ఇదం జగత్” అని నానుడి. నిజమేకానీ.. ధన సంపాదనే జీవిత ధ్యేయంగా పెట్టుకుని ఆదాయం మీద ఆశ తప్ప అన్య ఆలోచనలంటూ లేకపోతే ఇక ఆ జీవితం అత్యంత దయనీయమైన స్థితికి దారి తీస్తుందన్నది అంతే వాస్తవం.!మనిషికి బానిసగా ఉండాల్సిన సిరిసంపదలకు..ఆ మనుషులే బానిసలైతే..అంతకు మించిన దుస్థితి ఈ లోకంలో మరొకటి లేదు.!అవసరానికి మించిన ఆదాయం అనర్ధాన్ని తీసుకు వస్తుందని..అలాంటి ధన సంపాదన వలన సుఖం లేశ మైనా లేదన్న సత్యాన్ని శంకర భగవత్పాదులుఅత్యంత అర్థవంతమైనఈ సత్య సందేశాన్ని విశ్లేషణాత్మకంగా వివరించారు.
ఎందరో మహనీయులు మానవుని జీవన శైలికి సంభందించి ఎన్నో ఉత్తమ మార్గాలను భోదించారు.అయితే అవన్నీ కేవలం పుస్తకాల రూపంలో అటకెక్కాయి. మనిషి లో పెరిగిన దనదాహానికి అడ్డు కట్ట వేయలేని స్థితి ఏర్పడింది.వినాశ కాలే విపరీతి బుద్ధి అన్నారు పెద్దలు.ఇలా సగటు మనిషికి విపరీతమైన బుద్ది పుట్టి డబ్బు సంపాదన తప్ప వేరే ఇతర ఆలోచన చేయడం లేదు.
అలా కాకపోతే పేరుకు పేదవాడి ఆకలి తీర్చడం కోసం ఇచ్చే రేషన్ బియ్యం కొనుగోలు చేసి రోడ్లపై కొట్టుకుంటున్న దయనీయ స్థితికి వచ్చారంటే ఈ వ్యవస్థలు దేనికోసం ఉన్నాయి. ఎవరికోసం పనిచేస్తున్నాయి.ఈ ప్రభుత్వాలు ఎంత దిగజారి పోయి ఉన్నాయో ఆలోచించాలి మరి.ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన వ్యవస్థలలో మూడొంతుల భాగం అవినీతి కూపం లో కూరుకు పోయాయి.ఏ రాజకీయ పార్టీ చూసిన ,ఏ నాయకున్ని చూసిన ఆవినీతి మరక అంటించుకోకుండా పోలేదు.ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే ధనమేరా అన్నిటికి మూలం అన్న సూక్తి గుర్తుకు వస్తుంది. ఈ దన దాహానికి ముగింపు ఉంటుందా అంటే ఈ భూమి మీద సమగ్రంగా చెప్పే వాడు లేక పోయాడు.
రెవెన్యూశాఖ పనితీరే ప్రామాణికమా…
వ్యవస్థలో రెవెన్యూశాఖ చాలా కీలకమైనది.ప్రజల జీవన ప్రమాణాలు పూర్తిగా ఈ శాఖ పరిధిలో ఉంటాయి. అట్టడగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయి జీవన ప్రమాణాల వివరాలు ఈ శాఖ పరిధిలో నిక్షిప్తమై ఉంటాయి.ఈ శాఖ అంచనాలు,సూచనలు, నివేదికల ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి.
అయితే అలాంటి శాఖ పూర్తిగా అవినీతి లో కూరుకు పోయిందని చెప్పాలి.వ్యవస్థ ఏర్పడిన తొలినాళ్ళ నుంచి క్రమేణా అవినీతి మొక్క పెరిగి పెద్ద మహా వృక్షం అయింది. ఈ మహా వృక్షం కింద ఏ ప్రభుత్వం అయిన మొక రిల్ల వలసి వస్తుంది. ఇలాంటి వ్యవస్థ యొక్క అవినీతి వలన అక్రమ రేషన్ హాయిగా సరిహద్దులు దాటీ పోతుంది. ఒకప్పుడు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంచదార ఇచ్చేవారు. ప్రభుత్వాలు మారక ప్రజల ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నారు.అసలు ఈ రాష్ట్ర ప్రజలకు కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని ఇచ్చింది స్వర్గీయ నందమూరి తారకరామారావు. ఆనాడు దుర్భిక్షం లో పేద ప్రజలు అంబలి త్రాగి ఉండేవారు.తెల్ల అన్నం సంపన్న వర్గాల్లో మాత్రమే కనిపించేది.రేషన్ షాపుల ద్వారా 25 కిలోలు ఇవ్వడం తో ప్రతి పూరి గుడిసె లో తెల్ల అన్నము ఉండటం మొదలైనవి. కాలక్రమేణా రేషన్ బియ్యం తినడానికి ఇష్టం లేని వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఇప్పుడు.తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రేషన్ బియ్యం ఇస్తారనేది ఒకప్పుడు మాట.ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ,ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసమే అన్నది నిత్య సత్యం. అయితే ప్రభుత్వం ఇచ్చే రేషన్ అందరూ తీసుకునే వాళ్లే కానీ అందరూ అమ్ముకునే వాళ్లే..అందుకే అక్రమ రవాణా భారీగా జరుగుతూ బడాబాబులు రోడ్లెక్కి కొట్టుకు చస్తున్నారు.
అసలు విషయం మరిచిన ప్రజలు తాము అమ్మిన రేషన్ బియ్యాన్నే తిరిగి కల్తీ రూపంలో డబ్బులు పెచ్చుగా పెట్టి కొనుగోలు చేసి తింటున్నారన్న విషయం గుర్తించ లేక పోతున్నారు.ఇందుకు ఉదాహరణగా నిన్న బెజవాడ వరదల్లో పంచిన బియ్యం ఫ్యాకెట్లు చాలా అందమైన సంచులతో ఇచ్చారు.అవి ఎక్కడివి రేషన్ బియ్యమే.అయితే ఇందులో కల్తీ ఉండవు.ఓకే రకం బియ్యాన్ని ప్రభుత్వం ఇస్తుంది. వ్యాపారస్తుడు ఓ పాతిక కిలోలకు ఓ పది కిలోలు రేషన్ బియ్యాన్ని కలిపి కర్నూల్ సోనా,బాపట్ల,సోనా మసూరి,ఇతర పేర్లతో అమ్మితే అబ్బా ఈ బియ్యం సూపర్ అని తింటున్నారు సంపన్న వర్గాలు. ఇదంతా రెవెన్యూ శాఖ కు తెలియదా అంటే తెలుసు.అయితే స్వార్థం, రాజకీయ ప్రేరేపితం..అవినీతి పరుల అండదండలు చచ్చుబడిన మీడియా,నకీలీ గాళ్ల ప్రమేయం ఇలా ఒకటి కాదు అనేక కారణాలు ఉన్నాయి.వెరసి పేదల బియ్యం పరాయి దేశాలకు పోతున్నాయి.
చేష్టలుడిగిన పోలీసులతోనే..
సమాజంలో ఏ వ్యవస్థ కు రక్షణ ఇచ్చే పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం చేష్టలుడిగి చావా చచ్చి పోయిందని చెప్పాలి. కారణం మూడు సింహాలు ను నెత్తిన పెట్టుకొని దర్జాగా ఉండాల్సిన వారు అవినీతి కుంపటని నెత్తిన పెట్టుకుని సంచారం చేస్తుండటమే.. మితిమీరిన దనదాహం అనతి కాలంలో అత్యున్నత స్థాయి కి చేరుకోవాలనే దురాశ తో నమ్మిన సిద్ధాంతం న్యాయాన్ని నడివీధిలో అంగడి సరుకు చేస్తూ అభాసుపాలు అవుతున్నారు. ఒక నేరం జరిగితే అణువణువునా శోధించే వెసులుబాటు ఉంది.ఎక్కడ చీమ చిటుక్కు మన్నా నిఘా వర్గాలు అలెర్ట్ అవుతాయి.అలాంటిది జాతీయ రహదారిపై దర్జాగా లారీలతో రేషన్ బియ్యాన్ని తరలిస్తుంటే కట్టడి చేయలేని స్థితిలో ఉన్నారంటే నమ్మే స్థితి ఉందా అంటే ఫక్కున నవ్వుతోంది ప్రజానీకం.
రాజకీయ నాయకులు ప్రమేయం…
అసలు అన్ని వ్యవస్థ లను తమ అరిపాదాల కింద పెట్టుకునే ప్రయత్నం లో ఉన్నాయి రాజకీయ పార్టీలు అవి ఏ పార్టీ అయిన అధికార ము ఉంటే.అసెంబ్లీ సాక్షిగా అమ్మణాభూతులు తిట్టుకుంటూ తాము ప్రజల కోసమే ప్రజాప్రతినిధులుగా ఉంటూ ప్రజల కోసం చట్టాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థ ను తమ చెప్పు చేతుల్లో పెట్టు కుంటున్నారు. అలా కాక పోతే ఇలా రోడ్లెక్కి తన్నుకునే స్థాయి ఈ రేషన్ మాఫీయా వారికి ఎవరిచ్చారు. గత ప్రభుత్వం అవినీతి అరాచకం అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది.కార్లతో ఢీకొట్టుకునేంత పరిస్థితి ఏర్పడిందంటే ఏమనాలి. ప్రతి నియోజకవర్గంలో చెక్ పోస్టులున్నాయి రవాణా శాఖ ఉంది,పోలీసు శాఖ ఉంది.ఇంటిలిజెన్స్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఇలా ఇన్ని ఉన్నా ప్రతి గొడవ వెనుక మాఫీయా ఉంది.ఆ మాఫీయా వెనుక రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు.ఎవరి స్వలాభం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి.నేతల నీతి లేని మాటల వెనుక ఉన్న రహస్య మేమిటీ.ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఎటుపోతుందో అని ఒకరిపై ఇంకొకరు బురద జల్లే ప్రయత్నం చేస్తు ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది.రాజకీయ నాయకుల నీతి మాలిన పనులు మానేస్తేనే మానవుని మనుగడకు పెనుప్రమాదం తప్పుతుంది.
మీడియా భాగస్వామ్యం…
మీడియా అంటేనే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి.కానీ నేడు మీడియా అంటే చట్టవ్యతిరేకమైన పనులకు,అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.ఒక సీనియర్ పాత్రికేయుడు నేషనల్ మీడియాలో పని చేస్తూ కృష్ణా జిల్లా నుండి ఏలూరు ఆ పరిసర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలు తెలియపరిస్తే అందుకు ఓ నూట యాబై రూపాయలు ఇస్తాను అని చెప్పిన పాపానికి ఈరోజు ఒక వెల్డర్ గాడు జర్నలిస్ట్ గా మారి ఈ రాష్ర్టంలో ఉన్నా మాఫీయా లో ప్రధాన వ్యక్తిగా అవతరించాడు. లిక్కర్ మాఫీయా తో మొదలై రేషన్ మాఫియాను నడిపించే స్థాయికి వచ్చి దాదాపు కోటీ రూపాయలు పైగా వేనకేసి నట్లు తెలుస్తోంది. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు ఉర్దూ 4టీవీ అని చెప్పి ఆభూమి,ఈ భూమి అని చెప్పి ఇప్పుడు నేషనల్ మీడియా అక్రిడేషన్ కార్డు అడ్డదారీలో పొంది రేషన్ మాఫీయా వారితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి బోడి గుండు పెట్టుకుని ఓ 42 మంది దండుఫ్యాలెం బ్యాచ్ ను తయారు చేసి ఉభయ గోదావరి జిల్లా లు,ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో వసూళ్లు చేసుకుంటూ దర్జాగ తిరుగుతున్నాడు ఈ రోజు తిరువూరు నియోజకవర్గ పరిధిలోని ఏ కొండూరు లో లారీలు,కార్లతో ఢీకొట్టికున్న మాఫీయా డాన్ లో ఒకరితో ఈ బోడి గుండోడు భారీగా లాభాలు పొంది నట్లు రేషన్ మాఫీయా వారే చర్చించుకుంటున్నారు.ఇలాంటి మీడియా వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఏ అక్రమాలైన ఎందుకు జరగవో ఆలోచించాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు మీడియా ను ప్రక్షాళన చేస్తే రాష్ట్రంలో అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article