Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుముస్లిం వివాహ చట్టం రద్దు..అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం

ముస్లిం వివాహ చట్టం రద్దు..అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం

అస్సాం:లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) చట్టాన్ని తీసుకరావాలనే దిశగా మొదటి అడుగు వేసింది. సీఎం హిమంత బిస్వ శర్మ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ సంచలన నిర్ణయంతీసుకున్నారు. ముస్లిం వివాహ , విడాకుల నమోదు చట్టం 1935ని రద్దు చేయాలని నిర్ణయించింది. అస్సాం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశలో తీసుకున్న మొదటి అడుగుగా పరిగణిస్తున్నారు. యూసీసీని సాధించే దిశగా ఇదొక ముందడుగు అని ఆ రాష్ట్ర మంత్రి జయంత మల్లబారువా వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 28న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇకపై ముస్లింల పెళ్లీలు, విడాకుల నమోదును జిల్లా కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ చేపడతారని మంత్రి వివరించారు.
అసోం ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935ని రద్దు చేశామని, ఈ చట్టం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 94 రిజిస్టార్లు పనిచేస్తున్నారని మంత్రి జయంత మల్లబారువా తెలిపారు. వారంతా శుక్రవారం నుంచే రద్దు అయ్యారని వెల్లడించారు. ఇకపై ముస్లింల వివాహాలు, విడాకుల నమోదును జిల్లా కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ చేపడతారని మంత్రి వివరించారు. 94 మంది ముస్లిం రిజిస్ట్రార్లకు ఒక్కొక్కరికి ఏకమొత్తంలో రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కాగా ముస్లిం వివాహ చట్టం రద్దుతో సంబంధిత అంశాలు ప్రత్యేక వివాహ చట్టం పరిధిలోకి రానున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article