Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుసైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండండి

సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండండి

జిల్లా ఎస్పీ పి.జగదీష్

, అనంతపురము: ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగించే ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు, ఉద్యోగులు, ఉన్నత హోదాలలో ఉన్న వారు సైతం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారన్నారు. కొరియర్ పేరుతో మోసాలు, చైల్డ్ ఫోర్నో గ్రఫీ, డిజిటల్ అరెస్టు, ఓటీపీ మోసాలు, లోన్ యాప్, హ‌నీ ట్రాప్‌, లాటరీల పేరుతో మోసాలు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్టు మోసాలు, లక్షలు పెట్టుబడి పెడితే కోట్లు ఇస్తామని నమ్మబలకడం, వీడియోకాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్… ఇలా ఎన్నో రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు ఒడిగడతారని అలాంటి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల గురించి యువత కుటుంబంలోని వారికి, ఇతరులకు అవగాహాన కల్పించాలన్నారు. బ్యాంకు ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌ వర్డ్ లను సెట్ చేసుకోని సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే సంఘటన జరిగిన వెంటనే బాధితులు 1930 నెంబర్ కి డయల్ చేసి సమాచారం అందించడం లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో www.cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు. * గడచిన 24 గంటలలో హెల్మెట్, సీటు బెల్టు ధరించని వారిపై, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై మోటారు వాహనాల చట్ట ప్రకారంగా 482 కేసులు నమోదు చేశారు. రూ. 1,29,175 ఫైన్స్ వేశారు.* బహిరంగప్రదేశల్లో మద్యం సేవించి, ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 70 కేసులు నమోదు చేశారు. వీటితో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహన చోదకులపై 13 కేసులు నమోదు చేశారు* ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు అర్దరాత్రి వేళల్లో అనుమానాస్పందంగా సంచరిస్తున్న అపరిచితులు 103 మందిని తనిఖీలు చేసి ఒకరిని పోలీసు స్టేషన్లకు తరలించారు.* రాత్రి వేళ ఏటిఎం కేంద్రాల వద్ద భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 179 ఏటిఎం సెంటర్లను తనిఖీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article