Chandu, Author at Praja Bhoomi https://www.prajabhoomi.com/author/chanduvippala/ Get the Facts, Get Prajabhoomi Fri, 15 Nov 2024 13:05:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 అక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%82-%e0%b0%8e%e0%b0%82-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b1%8d/ https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%82-%e0%b0%8e%e0%b0%82-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b1%8d/#respond Fri, 15 Nov 2024 13:05:27 +0000 https://www.prajabhoomi.com/?p=19496 కాకినాడరూరల్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎం.ఎస్. ఎన్ పీజీ క్యాంపస్ ప్రాంగణంలో శుక్రవారం బిర్సా ముండా 150వ జయంతిని ప్రోగ్రాం కన్వీనర్ డా ఎల్ మధు కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ ఆచార సంప్రదాయలు పాటించటం విశేషమన్నారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం […]

The post అక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి appeared first on Praja Bhoomi.

]]>
కాకినాడరూరల్

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎం.ఎస్. ఎన్ పీజీ క్యాంపస్ ప్రాంగణంలో శుక్రవారం బిర్సా ముండా 150వ జయంతిని ప్రోగ్రాం కన్వీనర్ డా ఎల్ మధు కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పోచయ్య మాట్లాడుతూ వేదకాలం నుండి రామాయణ భారత కాలం వరకు వికసించిన భారతీయ సంస్కృతిని వారసత్వంగా స్వీకరించిన గిరిజనులు నేటికీ ఆచార సంప్రదాయలు పాటించటం విశేషమన్నారు. భాష, యాస, కట్టు, బొట్టు కోసం అలాగే అడవి, చెట్టు పుట్ట, నీటి రక్షణ కోసం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నవ యువకుడు బిర్సా ముండా అందరికీ ఆదర్శమన్నారు. అలాగే గిరిజనులు తమ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థ వికాసానికి కృషి చేయాలని కోరారు.మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ప్రశాంతిశ్రీ మాట్లాడుతూ తర తరాలుగా వికసించిన గిరిజన గ్రామీణ స్వావలంబాన పద్ధతులను ప్రజాస్వామ్య వ్యవస్థ గా పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగంలో ప్రస్తావించారని పేర్కొన్నారు. సీనియర్ అధ్యాపకులు డా నాని బాబు ప్రసంగింస్తూ ప్రతి ఒక్కరు బిర్సా ను ఆదర్శంగా తీసుకుని మానవతా విలువలు పాటిస్తూ జీవితంలో ఉన్నత దశలో చేరుకుని దేశసేవలో భాగస్వామ్యులు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డా అజయ్ రతన్,నదీమ్, డా స్టీఫెన్, డా హారిక, వరప్రసాద్, డా హరిబాబు,మనికంటేశ్వరారెడ్డి డా అప్పారావు, డా శ్రీదేవి, మనోజ్, డా గోపి ,శ్రీనివాస్, డా హేమలత, డా విజయశ్రీ,డా ఉమారజిత బోధననేతర సిబ్బంది శ్రీనివాస్ , సూరిబాబు,హరిబాబు, సత్తిబాబు, సంతోష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

The post అక్నూ ఎం ఎస్ ఎన్ క్యాంపస్ లో ఘ‌నంగా బిర్సాముండా జయంతి appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%a8%e0%b1%82-%e0%b0%8e%e0%b0%82-%e0%b0%8e%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%aa%e0%b0%b8%e0%b1%8d/feed/ 0
వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7 నా? https://www.prajabhoomi.com/vinayaka-chaturdi/ https://www.prajabhoomi.com/vinayaka-chaturdi/#respond Tue, 03 Sep 2024 08:12:29 +0000 https://www.prajabhoomi.com/?p=17838 వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబరులో గణేశ్ చతుర్థి జరుపుకుంటారు.ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7న ఉంటుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చతుర్థి తిథి సెప్టెంబర్ 6న ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుండటంతో ఏ తేదీని పరిగణనలోకి తీసుకోవాలనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. అయితే […]

The post వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7 నా? appeared first on Praja Bhoomi.

]]>
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఇది జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టాన్ని ప్రసాదించే గణేశుడి జన్మదిన వేడుక. భాద్రపద మాసంలోని శుక్లపక్షంలో ఆగస్టు లేదా సెప్టెంబరులో గణేశ్ చతుర్థి జరుపుకుంటారు.
ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7న ఉంటుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చతుర్థి తిథి సెప్టెంబర్ 6న ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 7 వరకు కొనసాగుతుండటంతో ఏ తేదీని పరిగణనలోకి తీసుకోవాలనే సందిగ్ధంలో చాలా మంది ఉన్నారు. అయితే దృక్ పంచాంగం ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీ శనివారం వినాయక చవితి జరుపుకోనున్నారు.

గణేశ్ పూజ ముహూర్తం – సెప్టెంబర్ 7న ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు,
చతుర్థి తిథి ప్రారంభం – సెప్టెంబర్ 6, 2024న మధ్యాహ్నం 3:01 గంటలకు
చతుర్థి తిథి ముగింపు – సెప్టెంబర్ 7, 2024 సాయంత్రం 5:37
వినాయకుని విగ్రహ స్థాపన సమయం – సెప్టెంబర్ 7, ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 1:34 వరకు

చంద్రుడు:
దృక్ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 3:01 గంటల నుండి రాత్రి 8:16 గంటల వరకు, సెప్టెంబర్ 7 న ఉదయం 9:30 నుండి రాత్రి 8:45 గంటల వరకు చంద్రుడిని చూడకూడదు. వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూడకూడదని చెబుతారు.గణేష్ చతుర్థి వేడుకలు 10 రోజులు జరుగుతాయి. ఈ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నా కూడా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో.. ముఖ్యంగా ముంబై, పూణే, హైదరాబాద్ వంటి నగరాలలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి.పండుగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి, స్వామిని ప్రార్థించి, పూజాది కార్యక్రమాలు నిర్వహించి, భోగం సమర్పించి, ఉపవాసం ఆచరిస్తారు. ఆచారాల ప్రకారం, ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు, మూడు రోజులు, ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు. గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది. ఈ రోజున భక్తులు వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు.

The post వినాయక చవితి సెప్టెంబర్ 6 లేదా 7 నా? appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/vinayaka-chaturdi/feed/ 0
ఎటువంటి కెమెరా లింకులు లేదా వీడియోలు లేవు :ఎస్పీ ప్ర‌క‌ట‌న https://www.prajabhoomi.com/sp/ https://www.prajabhoomi.com/sp/#respond Fri, 30 Aug 2024 07:32:54 +0000 https://www.prajabhoomi.com/?p=17721 గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినుల హాస్టల్‌లో రహస్య కెమెరాల అంశంపై మొదట ఆందోళన మొదలైంది. విద్యార్థినులు హాస్టల్ వాష్ రూంలో రహస్యంగా కెమెరాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆందోళన బాట పట్టారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని ల్యాప్‌టాప్ మరియు సెల్‌ఫోన్‌లను సీజ్ చేసి, సైబర్ నిపుణులతో పరిశీలన జరిపారు.విశ్లేషణలో వాష్ రూంల‌లో ఎటువంటి కెమెరా లింకులు లేదా వీడియోలు లేవని నిర్ధారణ అయ్యింది. కృష్ణా జిల్లా ఎస్సీ గంగాధ‌రరావు […]

The post ఎటువంటి కెమెరా లింకులు లేదా వీడియోలు లేవు :ఎస్పీ ప్ర‌క‌ట‌న appeared first on Praja Bhoomi.

]]>
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థినుల హాస్టల్‌లో రహస్య కెమెరాల అంశంపై మొదట ఆందోళన మొదలైంది. విద్యార్థినులు హాస్టల్ వాష్ రూంలో రహస్యంగా కెమెరాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆందోళన బాట పట్టారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొని, అతని ల్యాప్‌టాప్ మరియు సెల్‌ఫోన్‌లను సీజ్ చేసి, సైబర్ నిపుణులతో పరిశీలన జరిపారు.విశ్లేషణలో వాష్ రూంల‌లో ఎటువంటి కెమెరా లింకులు లేదా వీడియోలు లేవని నిర్ధారణ అయ్యింది. కృష్ణా జిల్లా ఎస్సీ గంగాధ‌రరావు ఈ విషయంపై ప్రకటన విడుదల చేశారు. విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అయితే, ఈ వార్తను ట్రోలింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంపై సీరియస్‌గా స్పందించారు. హాస్టల్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని, జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ లను ఘటనా స్థలానికి పంపాలని ఆదేశించారు.

The post ఎటువంటి కెమెరా లింకులు లేదా వీడియోలు లేవు :ఎస్పీ ప్ర‌క‌ట‌న appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/sp/feed/ 0
ధోనీ నాకు ఫ్రెండ్‌ కాదు.. పెద్దన్న కాదు.. https://www.prajabhoomi.com/dhoni-is-not-my-friend-not-my-elder/ https://www.prajabhoomi.com/dhoni-is-not-my-friend-not-my-elder/#respond Mon, 19 Aug 2024 10:20:24 +0000 https://www.prajabhoomi.com/?p=17286 భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం క్రికెట్‌కు మాత్రమే కాకుండా, యువ క్రికెటర్లకు గురువుగా, ఆరాధ్యుడిగా నిలిచిన వ్యక్తి. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ధోనీపై క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. భారత క్రికెట్‌ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది.ఈ నేపథ్యంలో, టీమ్‌ఇండియా బౌలర్ ఖలీల్ అహ్మద్ ధోనీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో, […]

The post ధోనీ నాకు ఫ్రెండ్‌ కాదు.. పెద్దన్న కాదు.. appeared first on Praja Bhoomi.

]]>
భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కేవలం క్రికెట్‌కు మాత్రమే కాకుండా, యువ క్రికెటర్లకు గురువుగా, ఆరాధ్యుడిగా నిలిచిన వ్యక్తి. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, ధోనీపై క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. భారత క్రికెట్‌ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీకి ప్రత్యేక స్థానం ఉంది.ఈ నేపథ్యంలో, టీమ్‌ఇండియా బౌలర్ ఖలీల్ అహ్మద్ ధోనీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో జరిగిన ఇంటర్వ్యూలో, ధోనీ తనకు స్నేహితుడు కాదని, పెద్దన్న కూడా కాదని, కానీ అతని గురువు అని చెప్పారు.ఖలీల్ తన అరంగేట్రం సమయంలో, ఆసియా కప్‌ టోర్నీలో తన తొలి ఓవర్‌ను వేయాలని ధోనీ అవకాశం ఇచ్చిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ధోనీ భాయ్ ఆ నిర్ణయం వల్లే తనకు మొదటి ఓవర్ వేయే అవకాశం లభించిందని, అంతటి కీలక బాధ్యత అప్పగించడంతో, తనపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచిందని చెప్పారు.ధోనీ తన కెప్టెన్సీ కాలంలో యువ క్రికెటర్లకు సహాయం చేయడంలో, వారికి ప్రేరణగా నిలవడంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఖలీల్ అహ్మద్ లాంటి క్రికెటర్లకు, ధోనీతో ఉన్న అనుబంధం ఒక గొప్ప గుర్తుగా ఉండిపోతుంది.

The post ధోనీ నాకు ఫ్రెండ్‌ కాదు.. పెద్దన్న కాదు.. appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/dhoni-is-not-my-friend-not-my-elder/feed/ 0
గ్రామగ్రామాన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి https://www.prajabhoomi.com/pawankalyan-2/ https://www.prajabhoomi.com/pawankalyan-2/#respond Sat, 10 Aug 2024 07:08:09 +0000 https://www.prajabhoomi.com/?p=16864 • ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంపు• ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని… ఆనాడు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా […]

The post గ్రామగ్రామాన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి appeared first on Praja Bhoomi.

]]>
వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంపు

• ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంపు
• ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటన

ప్రతీ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని… ఆనాడు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తారు. ఈ మొత్తంతో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున నిధులు అందిస్తారు.పవన్ కళ్యాణ్ ని ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో- స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నదీ తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత 34 ఏళ్లుగా రూ.వంద, రూ.250 చొప్పునే అందిస్తున్నట్లు తెలిపారు. ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదనీ, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు రూ.10 వేలు, రూ.25 వేలు నిర్ణయించారు.
పంచాయతీల అధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు నిర్దేశించారు. జాతీయ వేడుకలైన స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలి. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలి. ఆటల పోటీలు నిర్వహించాలి. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులను భాగస్వాములను చేయాలి. బహుమతులు అందించాలి. పంచాయతీ పరిధిలోని స్వతంత్ర సమరయోధులు, రక్షణ రంగం నుంచి వచ్చివారినీ, పారిశుధ్య కార్మికులను సత్కరించాలి. పాఠశాలలు, అంగన్వాడీల్లోని పిల్లలకు మిఠాయిలు/చాక్లెట్లు అందించాలి. పారిశుధ్యంపై మహాత్మా గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలి.

The post గ్రామగ్రామాన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/pawankalyan-2/feed/ 0
హనుమాన్ రూట్లో హాలీవుడ్ మూవీ.. మంకీ మ్యాన్ https://www.prajabhoomi.com/%e0%b0%b9%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d/ https://www.prajabhoomi.com/%e0%b0%b9%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d/#respond Sat, 27 Jan 2024 06:44:29 +0000 https://www.prajabhoomi.com/?p=2635 దేవ్ పటేల్ నటిస్తూ.. దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ.. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథ ఇది. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు దేవ్ పటేల్. ఈ మూవీతో శోభితా దూళిపాల హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.గత రెండేళ్లుగా ‘మంకీ మ్యాన్’ చిత్రీకరణ సాగుతోంది. దేవ్ పటేల్.. ఈ సినిమాను డైరెక్ట్ […]

The post హనుమాన్ రూట్లో హాలీవుడ్ మూవీ.. మంకీ మ్యాన్ appeared first on Praja Bhoomi.

]]>
దేవ్ పటేల్ నటిస్తూ.. దర్శకత్వం వహించిన ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. పేదవారిని కాపాడే హీరోగా తనను తాను భావిస్తూ.. హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లే హీరో కథ ఇది. మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చాడు దేవ్ పటేల్. ఈ మూవీతో శోభితా దూళిపాల హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
గత రెండేళ్లుగా ‘మంకీ మ్యాన్’ చిత్రీకరణ సాగుతోంది. దేవ్ పటేల్.. ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ ప్లే కూడా తానే ప్లాన్ చేసుకున్నాడు. ‘‘నా చిన్నతనంలో మా అమ్మ నాకు ఒక కథ చెప్పేది’’ అంటూ హీరో చెప్పిన డైలాగ్‌తో ‘మంకీ మ్యాన్’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో హనుమంతుడి ఫోటోలు కనిపిస్తాయి. ‘‘రాక్షస రాజు, తన సైన్యం కలిసి ప్రజలను భయపెట్టేవారు. అప్పుడే వారికి ప్రజల రక్షకుడు ఎదురయ్యాడు. ది వైట్ మంకీ’’ అని ‘మంకీ మ్యాన్’ సారాంశాన్ని ఒక డైలాగుతో చెప్పేశాడు హీరో. పెద్ద సిటీలో పేద ప్రజలను ఎవరూ పట్టించుకోరని, అలాంటి వారికి గుర్తింపు కోసం ఫైట్ చేస్తానని దేవ్ పటేల్ ముందుకు వస్తాడు. అదంతా తాను ఎలా చేస్తాడు అనేదే అసలు కథ అని ట్రైలర్‌లో స్పష్టం చేశారు మేకర్స్.
ఇప్పటికే హీరోగా ఎన్నో కంటెంట్ ఉన్న హాలీవుడ్ చిత్రాల్లో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు దేవ్ పటేల్. ఇప్పుడు మొదటిసారి ‘మంకీ మ్యాన్’తో డైరెక్టర్‌గా మారాడు. ముంబాయ్ సిటీలో తెరకెక్కించిన ఈ హాలీవుడ్ చిత్రంలో చాలావరకు ఇండియన్ యాక్టర్లనే తీసుకున్నాడు.
‘మంకీ మ్యాన్’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం వరల్డ్ వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.

The post హనుమాన్ రూట్లో హాలీవుడ్ మూవీ.. మంకీ మ్యాన్ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%b9%e0%b0%a8%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%b0%e0%b1%82%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b9%e0%b0%be%e0%b0%b2%e0%b1%80%e0%b0%b5%e0%b1%81%e0%b0%a1%e0%b1%8d/feed/ 0
మరోసారి భయపెట్టేలా బాబీ డియోల్ https://www.prajabhoomi.com/%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%af%e0%b0%aa%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%80/ https://www.prajabhoomi.com/%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%af%e0%b0%aa%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%80/#respond Sat, 27 Jan 2024 06:35:37 +0000 https://www.prajabhoomi.com/?p=2632 బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా ఈరోజు సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ తోనే భయపెట్టేసాడు బాబీ డియోల్. ‘యానిమల్’ సినిమాతో విలన్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్. గత ఏడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యానిమల్ సక్సెస్ తో బాబి డియోల్ కి సౌత్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ […]

The post మరోసారి భయపెట్టేలా బాబీ డియోల్ appeared first on Praja Bhoomi.

]]>
బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా ఈరోజు సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ తోనే భయపెట్టేసాడు బాబీ డియోల్. ‘యానిమల్’ సినిమాతో విలన్ గా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్. గత ఏడాది చివర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. యానిమల్ సక్సెస్ తో బాబి డియోల్ కి సౌత్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ సినిమాలో మరోసారి విలన్ రోల్ చేస్తున్నారు.
సినిమాలో బాబి డియోల్ ‘ఉదిరన్’ పాత్రలో కనిపించబోతున్నాడు. పోస్టర్ లో అతని గెటప్ మరింత భయంకరంగా ఉంది. గుబురు గడ్డం, పొడవాటి జుట్టు దానిపై జింక కొమ్ములు తగిలించుకొని ఆడవాళ్ళ మధ్య ఉన్న బాబీ డియోల్ లుక్ సినిమా పైనే అంచనాలను పెంచేసింది.ఈరోజు బాబీ డియోల్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ తోనే భయపెట్టేసాడు బాబీ డియోల్. సినిమాలో అతను ఎంత క్రూరంగా ఉంటాడనేది లుక్ ద్వారానే చూపించే ప్రయత్నం చేశారు.
యానిమల్ లో స్టైలిష్ వైలెంట్ విలన్ గా అదరగొట్టిన బాబి డియోల్ ఈసారి కంగువాలో ‘ఉదిరన్’ గా తన క్రూరత్వంతో మరింత భయపెట్టడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. సినిమాలో సూర్య మెకోవరే డిఫరెంట్ గా ఉందని అనుకుంటే అంతకుమించి బాబి డియోల్ లుక్ ని డిజైన్ చేశారు.సూర్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకంగా 38 భాషల్లో విడుదల చేయబోతున్నారు. తమిళ మాస్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య ఆరు విభిన్న తరహా పాత్రల్లో కనిపించబోతున్నాడు.

The post మరోసారి భయపెట్టేలా బాబీ డియోల్ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b%e0%b0%b8%e0%b0%be%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%ad%e0%b0%af%e0%b0%aa%e0%b1%86%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b1%87%e0%b0%b2%e0%b0%be-%e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%80/feed/ 0
బోయ‌పాటి-అల్లు కాంబోలో భారీ ప్రాజెక్ట్ https://www.prajabhoomi.com/%e0%b0%ac%e0%b1%8b%e0%b0%af%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad/ https://www.prajabhoomi.com/%e0%b0%ac%e0%b1%8b%e0%b0%af%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad/#respond Sat, 27 Jan 2024 06:27:36 +0000 https://www.prajabhoomi.com/?p=2629 క‌మర్షియ‌ల్ మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ల‌ కాంబినేష‌న్స్ గురించి విన‌గానే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం ఖాయం అనిపిస్తుంది. 2016లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వచ్చిన సినిమా సరైనోడు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ మూవీ ఎలాంటి విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి సరైనోడు మూవీకి దాదాపుగా రూ. […]

The post బోయ‌పాటి-అల్లు కాంబోలో భారీ ప్రాజెక్ట్ appeared first on Praja Bhoomi.

]]>
క‌మర్షియ‌ల్ మాస్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను, అగ్ర నిర్మాత ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌ల‌ కాంబినేష‌న్స్ గురించి విన‌గానే బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం ఖాయం అనిపిస్తుంది. 2016లో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వచ్చిన సినిమా సరైనోడు. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్ మూవీ ఎలాంటి విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి సరైనోడు మూవీకి దాదాపుగా రూ. 127 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంతటి సక్సెస్ కొట్టిందో. అయితే తాజాగా ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాంబినేషన్‌లో మ‌రో భారీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. ఇప్పుడా విషయం టాలీవుడ్‌లో ఆసక్తిగా మారింది.
సింహా, లెజండ్, స‌రైనోడు, భ‌ద్ర, తుల‌సి,అఖండ‌ వంటి క‌మర్షియ‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను త‌న అద్బుత‌మైన మాస్‌మేకింగ్ స్కిల్స్‌తో సినిమాలు తెర‌కెక్కించి మాస్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన బోయ‌పాటి శ్రీ‌ను, ఎన్నో అఖండ విజ‌యాలు సొంతం చేసుకున్న గొప్ప నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కాంబినేషన్ అన‌గానే సినీ ప్రేమికుల్లో ఎంతో ఆసక్తి కలుగుతుంది.
త్వ‌ర‌లో బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది గీతా ఆర్ట్స్ సంస్థ. “మాసివ్ ఫోర్సెస్ ఒక్కటి అవుతున్నాయి. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యాజికల్ మాస్ కాంబో మళ్లీ వచ్చేస్తోంది. త్వరలో అదిరిపోయే అప్డేట్స్ ఇస్తాం” అంటూ గీతా ఆర్ట్స్ సంస్థ తమ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ ట్వీట్‌లో గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ చెరోవైపు నిల్చుని ఉన్న ఫొటో ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్, ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. దీంతో మరి ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో హీరో ఎవరా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. బోయపాటి శ్రీనుతో సినిమా చేసే హీరో ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది.

The post బోయ‌పాటి-అల్లు కాంబోలో భారీ ప్రాజెక్ట్ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%ac%e0%b1%8b%e0%b0%af%e0%b0%aa%e0%b0%be%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%85%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%ac%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%ad/feed/ 0
ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ మూవీ.. ప్రేక్షకులు అసహనం ? https://www.prajabhoomi.com/%e0%b0%93%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae/ https://www.prajabhoomi.com/%e0%b0%93%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae/#respond Sat, 27 Jan 2024 06:17:39 +0000 https://www.prajabhoomi.com/?p=2626 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో యానిమల్ మూవీని తీసుకొచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి . మూడున్నర గంటల సినిమాతో కూడా హిట్ కొట్టి తన మార్క్ ఏంటో చూపించాడు. దీంతో యానిమల్ మూవీపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం మోత మోగిపోయింది. గత కొంతకాలంగా యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ తెగ బజ్ క్రియేట్ అయింది. యానిమల్ మూవీ […]

The post ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ మూవీ.. ప్రేక్షకులు అసహనం ? appeared first on Praja Bhoomi.

]]>
3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌తో యానిమల్ మూవీని తీసుకొచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి . మూడున్నర గంటల సినిమాతో కూడా హిట్ కొట్టి తన మార్క్ ఏంటో చూపించాడు. దీంతో యానిమల్ మూవీపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ సినిమాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం మోత మోగిపోయింది. గత కొంతకాలంగా యానిమల్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ తెగ బజ్ క్రియేట్ అయింది. యానిమల్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
యానిమల్ మూవీని 3 గంటల 29 నిమిషాలతో ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఎట్టకేలకు చెప్పినట్లుగా జనవరి 26 అర్ధరాత్రి నుంచి ఓటీటీలో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అది చూసి అభిమానులు తీవ్రస్థాయిలో నిరాశకు గురయ్యారు. దానికి కారణం థియేటర్లలో విడుదలైన రన్‌టైమ్‌తోనే యానిమల్ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం.యానిమల్ మూవీలో తనకు ఇష్టం లేకపోయినా కొన్ని సీన్స్ కట్ చేశానని, వాటిని ఓటీటీ రిలీజ్‌లో యాడ్ చేసినట్లు సందీప్ రెడ్డి కూడా తెలిపాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు అదనపు 8 నిమిషాలను యాడ్ చేసినట్లు తెలిపారు.కానీ థియేటర్లలో విడుదలైన 3 గంటల 21 నిమిషాల రన్‌టైమ్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌లో యానిమల్‌ను రిలీజ్ చేయడంతో అభిమానులు, అదనపు సన్నివేశాలు చూద్దామనుకున్న ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

The post ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్ మూవీ.. ప్రేక్షకులు అసహనం ? appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%93%e0%b0%9f%e0%b1%80%e0%b0%9f%e0%b1%80%e0%b0%b2%e0%b1%8b%e0%b0%95%e0%b0%bf-%e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%af%e0%b0%be%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae/feed/ 0
మూడో రోజు ఇండియా ఆలౌట్.. 190 పరుగుల ఆధిక్యం.. https://www.prajabhoomi.com/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%86%e0%b0%b2%e0%b1%8c%e0%b0%9f%e0%b1%8d-190-%e0%b0%aa%e0%b0%b0/ https://www.prajabhoomi.com/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%86%e0%b0%b2%e0%b1%8c%e0%b0%9f%e0%b1%8d-190-%e0%b0%aa%e0%b0%b0/#respond Sat, 27 Jan 2024 06:07:56 +0000 https://www.prajabhoomi.com/?p=2623 హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 436 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ 421/7 స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ కాసేపటికే మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌గా కాగా…… మన ఆధిక్యం 190గా ఉంది. బ్యాటింగ్‌లో జడేజా (87), కేఎల్‌ (86) జైస్వాల్‌ (80) అర్థ సెంచరీలతో రాణించారు . అక్షర్‌ (44), భరత్‌ (41) అర్ధశతకాలు చేజార్చుకున్నారు. రోహిత్‌ (24), […]

The post మూడో రోజు ఇండియా ఆలౌట్.. 190 పరుగుల ఆధిక్యం.. appeared first on Praja Bhoomi.

]]>
హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 436 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ 421/7 స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ కాసేపటికే మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్‌గా కాగా…… మన ఆధిక్యం 190గా ఉంది. బ్యాటింగ్‌లో జడేజా (87), కేఎల్‌ (86) జైస్వాల్‌ (80) అర్థ సెంచరీలతో రాణించారు . అక్షర్‌ (44), భరత్‌ (41) అర్ధశతకాలు చేజార్చుకున్నారు. రోహిత్‌ (24), గిల్‌ (23), అయ్యర్‌ (35) ఫర్వాలేదనిపించగా.. అశ్విన్‌ (1), బుమ్రా (0) నిరాశపరిచారు. సిరాజ్‌ నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రూట్‌ నాలుగు, హార్ట్‌లీ రెండు వికెట్లు తీశారు.
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.
ఇంగ్లాండ్‌పై భారత్‌ ఇప్పటికే 190 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్పిన్‌ తిరుగుతున్న వేళ బ్రిటీష్‌ జట్టు.. భారత్‌ బౌలర్ల సవాల్‌ను స్వీకరించడం అంత తేలికేం కాదు. తొలుత బంతితో ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన భారత జట్టు.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ చెలరేగి మ్యాచ్‌పై పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ స్కోరు 76 పరుగులతో క్రీజులోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌ త్వరగానే పెవిలియన్‌కు చేరాడు. సెంచరీ సాధిస్తాడని అందరూ అనుకున్న వేళ 76 పరుగులకు మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి జైస్వాల్‌ అవుటయ్యాడు. రూట్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ 80 పరుగులు చేసి అవుటయ్యాడు. జైస్వాల్‌ అవుటయ్యాక కె.ఎల్‌ రాహుల్‌ క్రీజులోకి వచ్చాడు. గిల్‌, రాహుల్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. రూట్‌, హార్ట్‌లీ బౌలింగ్‌ను వీరిద్దరూ సమర్థంగా ఎదుర్కొన్నారు. కానీ అప్పటివరకూ జాగ్రత్తగా ఆడిన గిల్‌ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. హార్ట్‌ లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శుభ్‌మన్‌ గిల్‌ అవుటయ్యారు. 23 పరుగులు చేసి గిల్‌ అవుట్‌ కావడంతో టీమిండియా 159 పరుగుల వద్ద మూడో వికెట‌్ కోల్పోయింది. అనంతరం శ్రేయస్స్ అయ్యర్‌తో కలిసి రాహుల్ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ చక్కటి భాగస్వామ్యంతో భారత స్కోరు బోర్డును 200 పరుగులు దాటించారు. తొలి సెషన్‌ను విజయంవంతంగా ముగించిన భారత్‌కు రెండో సెషన్‌ ఆరంభంలోనే షాక్‌ తగిలింది. మంచి టచ్‌లో కనిపించిన శ్రేయస్స్ అయ్యర్‌ భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. 35 పరుగులు చేసిన అయ్యర్‌ రెహాన్‌ బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 223 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది.

The post మూడో రోజు ఇండియా ఆలౌట్.. 190 పరుగుల ఆధిక్యం.. appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/%e0%b0%ae%e0%b1%82%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%81-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be-%e0%b0%86%e0%b0%b2%e0%b1%8c%e0%b0%9f%e0%b1%8d-190-%e0%b0%aa%e0%b0%b0/feed/ 0