బద్వేలు పట్టణ స్లంయేరియాలో కనీస మౌలిక సౌకర్యాలు కొరకు ఆర్డీవో ఆఫీస్ ఎదుట సిపిఎం ధర్నా.
పేదల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేయాలి. సమస్యల పట్ల ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయి. 2024 ఎన్నికల్లో పేదలనుపట్టించుకోని పాలకులకు బుద్ధిచెప్పాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్.
బద్వేల్ :బద్వేలు స్థానిక మార్కెట్ యార్డ్ నుండి బద్వేలు ఆర్డిఓ కార్యాలయం వరకు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం బద్వేల్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో , బద్వేల్ పట్టణంలోని స్లంయేరియాలలోని నివాసాలు ఉంటున్న పేదలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రదర్శన గా వెళ్లి “ధర్నా” నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ… బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీ, ఐలమ్మ కాలనీ, జ్యోతిబాసు కాలనీ ఏర్పడి నేటికీ 20 సంవత్సరాలు పూర్తవుతున్న అక్కడి మూడు కాలనీలలో నివాసం ఉంటున్న సుమారు 4వేల కుటుంబాల వారికి కనీస మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్లు, కరెంటు, రేషన్ కార్డులు, ప్రభుత్వ నవరత్నాలు సంక్షేమ పథకాలు, జగనన్న బిల్డింగులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డోర్ నెంబర్లు, ఇంటి పట్టాలు, కనీసం అనుబంధ ఫారాలు,స్మశాన వాటికలు ఏర్పాటు చేయలేదని వారు విమర్శించారు. ఓటు కార్డులు, ఆధార్ కార్డులు, వికలాంగుల, వితంతు, వృద్ధాప్య పెన్షన్లు ఏ ఒక్కటి కూడా సక్రమంగా అందరికీ అందడం లేదని వారు అన్నారు.
బద్వేల్ మున్సిపాలిటీ లోని మున్సిపల్ పాలకవర్గం గాని, బద్వేల్ శాసన సభ్యులు గానీ, శాసనమండలి సభ్యులు గానీ ఎన్నికల అప్పుడు వచ్చి వాగ్దానాలు ఇచ్చి వెళ్తున్నారని, పాత వచ్చిఅభివృద్ధి కార్యక్రమాల సమీక్ష చేసిన పాపాన పోలేదని ఒక్క సిపిఎం మాత్రమే అక్కడి పేద ప్రజల కష్టాలలో, బాధల్లో , ఇబ్బందుల్లో , నష్టాల్లో వారితో ఉండి వారికి అండగా నిలుస్తోందని వారు గుర్తు చేశారు. భారత రాజ్యాంగంచే ఏర్పడిన పేదల అనుకూల చట్టాలు ఎక్కడికి పోయాయో, ఎందుకు అమలు చేయడం లేదో, పాలకులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చదువు లేని పేద ప్రజలను పేదరికంలోనే తరతరాలుగా ఉంచుతున్న, వారి సంక్షేమం, విద్య , వైద్యం , గృహస్రాలు , ఉపాధి పట్టించుకోని పాలక ప్రభుత్వాలకు, 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని వారు గుర్తు చేశారు. పేదలందరూ ఐక్యంగా వారి సమస్యల పరిష్కారం అయ్యేవరకు పోరాటం ఆపకూడదని పోరాటం ద్వారానే ముద్దు నిద్రపోయే ప్రభుత్వాల నిద్ర లేపాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు బి.మనోహర్, పట్టణ కార్యదర్శి కే.శ్రీనివాసులు, బద్వేలు పట్టణ కమిటీ సభ్యులు పి.చాంద్ బాషా, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం.చిన్ని, సిపిఎం నాయకులు పి.సి.కొండయ్య, ఆంజనేయులు, జి.నాగార్జున, మోక్షమ్మ, అనంతమ్మ , మస్తాన్ బి , రామ లచ్చమ్మ, బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.