తమలపాకులు శతాబ్దాలుగా భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వాటిని సాంప్రదాయకంగా పూజలలో ఉపయోగించడంతో పాటు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడతారు. తమలపాకులో విటమిన్ సి, నియాసిన్, థయామిన్, కెరోటిన్, రిబోప్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, వాటిని తాంబులం రూపంలో తినే కంటే, నీటిలో మరిగించి ఆ రసాన్ని తాగడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చని వారు సిఫార్సు చేస్తున్నారు. అయితే దీని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.తమలపాకు నీరు మలబద్ధకానికి చాలా మంచి ఔషధం. ఇది ప్రేగు కదలికలను సున్నితంగా పెంచుతుంది, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తమలపాకులో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తమలపాకు నీరు మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించడంలో సహాయపడుతుంది.
తమలపాకు నీటిని తాగడం వల్ల నోటి పుళ్ళు, పీయడం, దుర్వాసన వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. జుట్టు రాలడం, జుట్టు తెల్లబడటం వంటి జుట్టు సమస్యలకు కూడా ఇది మంచి ఔషధం. చర్మ సమస్యలైన మొటిమలు, దద్దుర్లు వంటి వాటిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో సహాయపడతాయి. తమలపాకు జీవక్రియను పెంచడంలో శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.