తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యుడుగా భారతీయ జనతా పార్టీకి చెందిన తిరుపతి వాసి భానుప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన తితిదే బోర్డు సభ్యుడుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయన క్షేత్రస్థాయిలో తన విధుల్లో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ఆయన భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సామాన్య భక్తుడిగా నేలపై పడుకున్నారు. తిరుపతిలోని యాత్రి సదన్‌లో ఆయన ఇతర శ్రీవారి భక్తులతో కలిసి నిద్రించారు. ఈ సందర్భంగా ఆయన భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు వెల్లడించిన అన్ని సమస్యలను తితిదే పాలక మండలి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు.