Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుటీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు..54వ ఛైర్మన్‌గా బాధ్యతలు

టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు..54వ ఛైర్మన్‌గా బాధ్యతలు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలోని జయ విజయలు దగ్గర బీఆర్‌ నాయుడుతో టీటీడీ ఈవో , అదనపు ఈఓ, జేఈఓల సమక్షంలో ప్రమాణం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి మూలవిరాట్టును టీటీడీ ఛైర్మన్‌ హోదాలో బీఆర్‌ నాయుడు దర్శించుకున్నారు. తిరుమల రంగ నాయకుల మండపంలో టీటీడీ 54వ చైర్మన్‌గా బి.ఆర్.నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ ఛైర్మన్‌తో పాటు పలువురు పాలక మండలి సభ్యులు ప్రమాణం చేశారు.
బీఆర్ నాయుడు ప్రస్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నూతన ఛైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు నియమితులయ్యారు. టీవీ5 ఛైర్మన్ గా ఇరు తెలుగు రాష్ట్రాలకు బీఆర్ నాయుడు సుపరిచితులు. మీడియా సంస్థ యజమానిగా, వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన సీఎం చంద్రబాబు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా అవకాశం కల్పించారు.చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బీఆర్ నాయుడు చిన్నతనం నుంచి స్వయంకృషితో ఎదిగారు. తల్లిదండ్రులు మునిస్వామి నాయుడు- లక్ష్మిల ఆరుగురు సంతానంలో చివరివాడైన బీఆర్ నాయుడు స్థానికంగా చదువు పూర్తి చేసిన నాయుడు తరువాత సాంకేతిక విద్య నేర్చుకొని హైదరాబాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగంలో చేరారు.బిహెచ్‌ఈఎల్‌ ఉద్యోగిగా బీహెచ్ఈఎల్ సాంస్కృతిక, సాహిత్య విభాగాల్లోనూ చురుకుగా పని చేశారు. 12 వేలమంది ఉద్యోగులు ఉండే బీహెచ్ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. బీఆర్ నాయుడు సతీమణి విజయలక్ష్మి కూడా బీహెచ్ఈఎల్ లోనే పనిచేశారు.బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగం తర్వాత ట్రావెల్ క్లబ్ పేరున ఎయిర్ టికెట్ వ్యాపారంలో ప్రవేశించిన బీఆర్ నాయుడు అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత 2007లో టీవీ5, హిందూ ధర్మం, నూజెన్ హెర్బల్స్ లాంటి సంస్థలను స్థాపించి తన వ్యాపారాన్ని విస్తరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article