Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే!

బ్రెయిన్ స్ట్రోక్ అనేది మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా ఆగిపోవడం వలన వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఆక్సిజన్‌ కణాల్లోకి సరఫరా నిలిచిపోవడం కారణంగా ఇలా జరిగే ప్రమాదం ఉంటుందని, ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలి, లేకపోతే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందువలన ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే కొన్ని లక్షణాలను గురించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటే, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
స్ట్రోక్ రావడానికి ముందు మైకంలా వచ్చి కళ్లు తిరిగి పడిపోవడం,నీరసం, బలహీనంగా మారడం లాంటిది జరుగుతుంది, ఆకస్మిక గందరగోళం, మాట్లాడటం కష్టం లేదా ప్రసంగాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కంటి చూపు సరిగా ఉండక పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది,ముఖం, చేయి లేదా కాలు, ముఖ్యంగా ఒక వైపు ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, ఒకటి లేదా రెండు కళ్లలో ఆకస్మిక ఇబ్బంది.ఎటువంటి కారణం లేకుండా ఆకస్మిక, తీవ్రమైన తలనొప్పి,కాళ్లు, చేతుల్లో పక్షవాతం రావడం, సరిగా మాట్లాడలేకపోవడం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article