Thursday, November 28, 2024

Creating liberating content

రాజకీయాలుబుడమేరు పాపం బడా నేతలదేనా…

బుడమేరు పాపం బడా నేతలదేనా…

కొల్లేరు అక్రమణలు కొంపలు కూల్చాయా..
అధికార దాహానికి అభాగ్యులు బలికావాల్సిందేనా…
బుడమేరు అక్రమాలు తొలగిస్తారా తోడుంటారా..
బడాబాబుల భూదాహానికి ఇంకెంతమంది భూమిలో కలవాలి…
బుడమేరు అక్రమాలను బాబు సరిచేస్తారా ..
తెలంగాణ హైడ్రా పాలసీని ఏపీ ఫాలో అవుతుందా..
కండువాలు మార్చితే కట్టడాలు కూల్చివేత ….
నేతల అవినీతికి నీళ్లపాలు అవ్వాల్సిందేనా…
బుల్డోజర్లు తిరగాల్సింది బుడమేరు మీదేనా…
బుడమేరు ఆక్రమణల పై తిరగవా..
ప్రశ్నిస్తే…వాస్తవాలు రాస్తే దాడులు కేసులు పెడతారా..
ఎన్ని కేసులు ఎంతమంది మీద చేస్తారు ..
అవినీతి అధికారులు అన్ని నాళ్లు ఉంటారా..
నీతి అనేది పనికిరాకుండా పోతుందా…
నీతిమాలిన పనుల వల్లే నీటిలో ముంచేశారు…
చంద్రన్న పవనన్న మాట వింటాడా…
అక్రమాల అంతు చూస్తారా…
ఆ పార్టీ కండువా కప్పుకుంటే కామ్ అవుతాడా…
ఈ కన్నీటి గాధ కు శాశ్విత కట్టడి చేస్తారా…
కూటమి అనుకుంటే కూల్చడం ఖాయమే…

(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)

స్వార్థం ఉండాలి అది ఎంత వరకు ఇతరులను ముంచేసే విధంగా ఉండకూడదు.ఒకడికి నీవు హాని చేస్తే అదే తీరులో ఇంకొకడు నీకు హాని తప్పక చేస్తాడు..చేసి తీరతాడు…ఇది లోకోత్తర ధర్మం.కాస్త అటు ఇటు కావచ్చు.ఫలితం అనుభవించక తప్పదు. సరిగ్గా ఇప్పుడు అదే జరగబోతుంది…జరిగి తీరుతుంది. ప్రకృతిని ప్రేమించాలి అతిక్రమణ చేయకూడదు. అది వినాసనానికి దారి తీస్తుంది. ఆ తరువాత ఘోరమైన పరిస్థితులు చూడాల్సి వస్తది. సరిగా ఇదే బెజవాడ లో జరిగింది.కొంతమంది స్వార్ధ పరులు కేవలం తమ స్వార్ధ ప్రయోజనాలకోసం వాగులు వంకలు,నదీ పరివాహక ప్రాంతాలు ఆక్రమించి స్థిరమైన కట్టడాలు కట్టడం తో ప్రకృతి ప్రకోపం తలెత్తి నప్పుడు బలవంతుడు బాగానే ఉంటున్నాడు..బలహీనుడు బలి అయ్యి పోతున్నాడు.ప్రధానంగా రాజకీయ వ్యవస్థ గాడి తప్పడం తో ప్రతి వ్యవస్థ గాడి తప్పి సామాన్య ప్రజలు అస్తవ్యస్తమవుతున్నాయి.
అలాంటిదే నేటి బెజవాడ వరదకు కారణం.అసలు బుడమేరు ఎక్కడ పుట్టింది ఏక్కడ కలవాలి అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ ప్రమాదానికి కారమైన వారిని ఆ వరద ప్రవాహం లో కలిపిన పాపం కాదన్న బాధ నేటి బాధితుల నుండి వెలువడుతోంది.ప్రపంచ ఖ్యాతి గాంచిన కొల్లేరు సరస్సు కొల్లగొట్టారు.ఆరుదయిన పక్షి సంపద కూడా లేకుండా చేసిన ఈ భూ భకాసురులని ఏమనాలి.. ఇంకే మనాలో అర్థం కానీ పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ అధికారం లో ఉంటే ఆ పార్టీ పంచన మొదటి వరసలో చేరి ఆ పార్టీ అధికారాన్నీ అడ్డుపెట్టుకుని అడ్డంగా దోచుకునెందుకు నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టి సహజ వనరులను కూడా అక్రమము చేస్తే చివరికి అన్యాయం అయ్యేది సామాన్య ప్రజలే.
ఈ రోజు కళ్ళుమూసి తెరిచె లోపు ఏ పాపం చేయక పోయినా ఏ అన్యాక్రాంతం కు పాల్పడక పోయినా ప్రాణాలు పోగుట్టు కున్నారు.పొట్టకూటి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జీవిస్తున్న అనేక కుటుంబాల్లో విషాదం నింపిన ఈ అవినీతి గద్దల్లాంటి పెద్దలను ఏమి చేస్తే పోయిన ప్రాణాలు వస్తాయి.ఏడు పదుల వయస్సు దాటిన ఎంతో శ్రమించాల్సి వస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. ప్రజా సంక్షేమం. కోసం పరితపించే పరిస్థితి ఉన్నా ఇలాంటి ఉపద్రవం నుంచి బాధితులకు ఉపశమనం కలిగించాలంటే ఎంత వేదన ఉంటుందో ఈ పనికిమాలిన అక్రమ దారులకు తెలుస్తుందా. ఎవరో కదా పోయేది మన కుటుంబాలు బాగానే ఉన్నాయి అనుకుంటే తప్పవుతుంది. కర్మ అనేది ఎవరిని వదిలి పెట్టదు.జరుగుతున్న తీరు భవిష్యత్ తరాలకు జరుగు నష్టాన్ని అంచనా వేసి కొన్ని కథనాలను రాస్తే కుక్క బిస్కెట్ ల కోసం ఆశపడే అడ్డమైన బోడిగుండోడి లాంటి జర్నలిజం లో ఉన్న యర్నలిస్ట్ లను చూసి అదే అంచనా తో దున్న ఈనింది అంటే ఘటికి కట్టెయ్ అన్న చందానా కేసులు బెదిరింపులు ఇలా వీరికి ఉన్న నడిమంత్రపు అధికారముతో వెధవ పనులకు దిగడం పరిపాటిగా మారింది. అధికారం శాస్వితం అనుకోకుడదు .కృష్ణా నదీ వెంబడి ఆనందం ఉల్లాసం కోసం కట్టడాలు కట్టారు నేడు ఏమయింది అదే అయింది.ప్రకృతి ప్రకోపం ఎవరిని వదలదు వదిలే ప్రసక్తి లేదు.అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ మంచి మాట చెప్పుకొచ్చారు.తెలంగాణ లో మాదిరి హైడ్రా ను కూడా ఇక్కడ అమలు చేస్తే సామాన్య ప్రజలు ఎంతో సంతోషిస్తారు.ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా అలాంటి చర్యలు తీసుకుంటే భవిష్యత్ లో ఇలాంటి ఉపద్రవం తలెత్తినా కనీసం ప్రాణ నష్టం జరగకుండా చూడచ్చు. చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article