మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు.
,బుట్టాయగూడెం.
రానన్న ఐదు రోజులపాటు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులుపంట కోతలు చేపట్టకుండా, కోసిన పంటను జాగ్రత్త చేసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని మండల వ్యవసాయ అధికారి డి. ముత్యాలరావు సూచించారు. మండలంలోని లక్ష్ముడుగూడెం, దొరమామిడిలలో బుధవారం మండల వ్యవసాయ అధికారి డి.ముత్యాలరావు ఆధ్వర్యంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల విస్తరణ కార్యక్రమం పొలం పిలుస్తుంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ఖరీఫ్ 2024 సీజన్ సంబంధించి వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయని, రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యం అమ్మకం చేయాలని తెలిపారు. ప్రస్తుతం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వరి సాగు చేసిన రైతులు ఐదు రోజులపాటు కోతలు నిలుపుదల చేయాలని, ఇప్పటికే కోసిన వరి పంట పనల మీద గాని, ధాన్యం రాశుల మీద గాని, ధాన్యం కళ్ళల్లో ఉన్నట్లయితే గనుక రైతులు సురక్షితమైన ప్రదేశాలకి తీసుకువెళ్లి భద్రపరచాలని, ధాన్యం రాశుల మీద ధాన్యం తడవకుండా బరకాలు కప్పాలని తెలిపారు. అనంతరం రైతులతో కలిసి వరి పంటలను పరిశీలించి తగిన సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం సహాయకులు కుసుమ, మౌనిక మరియు గ్రామ రైతులు హాజరైనారు.