Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్లిచీ పండ్ల‌తో క్యాన్సర్స్ దూరం

లిచీ పండ్ల‌తో క్యాన్సర్స్ దూరం

లిచీ పండ్లు ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. ఈ పండ్లలో విటమిన్స్, ఖనిజాలకి గొప్ప మూలమని చెప్పొచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, లిపిడ్స్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉన్నాయి.ఈ పండ్లను తినడం వల్ల అల్జీమర్స్ వంటి సమస్యలు దూరమవుతాయి. లిచీ సీడ్ ఎక్స్‌ట్రాక్ట్‌లోని సపోనిన్ సమ్మేళనాలు అభిజ్ఞా పనితీరుని మెరుగ్గా చేసి అల్జీమర్స్‌ని తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది.వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. దీని వల్ల సీజనల్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసుకోవచ్చు. లిచీలోని పాలీశాకరైడ్స్, ఫ్లేవనైడ్స్ వంటి సమ్మేళనాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటిని మీరు డ్రైడ్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్‌లా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా లాభాలుంటాయి.లిచీ పండ్లలో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం పాలీఫెనాల్స్ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఉండే తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువగా దాహం, అతిగా ఆకలి వేయడం కంట్రోల్ అవుతాయి. ఇవి మెటబాలిజం రేటుని కూడా రెగ్యులేట్ చేస్తాయి.చాలా అధ్యయనాల్లో తేలింది ఏంటంటే.. లిచీ పండ్లు యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. దీనికి కారణం అందులోని పాలీఫెనాల్స్, పాలీశాకరైడ్స్. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదల ఆపుతాయి. ల్యాబ్ పరిశోధనల్లో తేలిందేంటంటే లీచీ పండ్లు బ్రెస్ట్ క్యాన్సర్‌ని కూడా కంట్రోల్ చేయగలవు. వీటితో పాటు యాంటీ క్యాన్సర్ గుణాల కారణంగా లంగ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.ఈ పండ్లు తియ్యగా ఉంటాయి. కాబట్టి, నేరుగా తీసుకోవచ్చు. లేదంటే డ్రైడ్ ఫ్రూట్స్‌లా తీసుకోవచ్చే. జ్యూస్‌లా కూడా తీసుకోవచ్చు. మార్కెట్లో ఈ పండ్లతో తయారైన పిల్స్ కూడా దొరుకుతాయి. అయితే, ఎలా తీసుకోవాలనేది డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యాకనే తీసుకోవాలి. దీంతో పాటు అధిక మోతాదులో కాకుండా డాక్టర్ సలహా ప్రకారమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది.వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article