కృష్ణుడు సమక్షంలో చేరికలు జన ప్రభంనంతో మీ ఇంటికి దివ్య
తుని:తెలుగుదేశం, జనసేన మైత్రి జనరంజకం, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన పార్టీలు ఒక్కటైయ్యాయని తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల దివ్య అన్నారు.మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఎస్ అన్నవరంలో బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జనసేన తెలుగుదేశం శ్రేణుల ఆనందోత్సవాల మధ్య కొనసాగింది.ఇంటింటికీ వెళ్ళిన యనమల దివ్య తెలుగుదేశం సూపర్ సిక్స్ పధకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ అందరి సంక్షేమమే టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం లక్ష్యమన్నారు
ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు మోతుకూరి వెంకటేష్,జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, టీడీపీ నాయకులు అప్పన రమేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, వంగలపూడి శ్రీనివాసరావు, వంగలపూడి బుజ్జి, బోడాల జమీలు, చోడిశెట్టి దొంగయ్య, కుర్రా కోటి, పోలిశెట్టి మార్కండేయులు,పోలిశెట్టి దారబాబు, చింతంనీడి విజయ్, ఆకుల వరహాలు,దాసరి త్రిమూర్తులు, అడపా రమణ, వంగలపూడి చక్రర్రావు, వంగలపూడి కృష్ణ,బోణం చినబాబు, జనసేన నాయకులు వంగలపూడి నాగేంద్ర, చోడిశెట్టి భాస్కర్, వంగలపూడి వంశీ, దుబాసి ప్రసన్న, ప్రవీణ్, నాయుడు, చిన్న, సురేష్, రాంబాబు, నానాజీ, బాలాజీ, అశోక్, నరేష్, కరెడ్ల సురేష్, శివకృష్ణ, లక్ష్మణ్ , చోడిశెట్టి శివరామ్ మండల నాయకులు చింతంనీడి అబ్బాయి, గాది వరహాల బాబు,పోతల రాంబాబు, జక్కాన రామనాయుడు, రామచంద్ర రాజు,తదితరులు పాల్గొన్నారు
కొత్త సూరవరంలో టీడీపీలోకి చేరికలు
మంత్రి దాడిశెట్టి రాజా ఇలాకాలో తెలుగుదేశం పార్టీ లోకి వలసలు జోరందుకున్నాయి.వరస చేరికలతో తమ్ముళ్లు జోష్ లో ఉన్నారు.కొత్తసూరవరంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోచేరాయి.. సీనియర్ నాయకులు అప్పన రమేష్, వంగలపూడి బుజ్జి, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, వంగలపూడి శ్రీనివాసరావు సమక్షంలో పందిరి సత్యనారాయణ , ఉగ్గిన శ్రీనివాసరావు, పందిరి అనిల్ కుమార్, పందిరి మణికంఠ, మైనారపు సూరిలోవరాజు, ఇనుకుర్తి సురేష్, మైనారపు సత్తిబాబు, బసపోయిన అప్పారావు, కూనూరీ జగదీష్, కర్రీ బాబ్జి, బోలిశెట్టి బాబులు, కూనూరి గణేష్, సంధిపర్తి అప్పారావు, సినిమాల రాజు, ప్రగడ నాని లకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ నుంచి రోజురోజుకు తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయని, ఇక వైకాపా ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. అనంతరం ఇటీవల గాయపడిన సీనియర్ కార్యకర్త పందిరి చిన్నబ్బాయిను కృష్ణుడు పరామర్శించారు